Vande Bharat: దేశంలో ఒక్కొక్కటిగా వందేభారత్ రైళ్లు విస్తరిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలను కలుపుకుంటూ ఇంటర్ స్టేట్ రైళ్లుగా రాకపోకలు సాగిస్తున్న ఈ రైళ్లకు ఆదరణ కూడా పెరుగుతోంది. అందుకే టికెట్లు చాలావరకూ హౌస్ ఫుల్ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వందేభారత్ రైళ్లు వివిధ నగరాల మధ్య జోరుగా పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం మూడు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, విజయవాడ-చెన్నై మధ్య వందేభారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అన్నింటికీ ఆదరణ పెరగడంతో టికెట్లు కూడా ఫుల్ అవుతన్నాయి. అయితే ఒక లోపం మాత్రం దేశవ్యాప్తంగా అన్ని వందేబారత్ రైళ్లలో ఉంది. అది గరిష్టంగా 8-10 గంటలు కూర్చుని ప్రయాణించడం. పెద్దోళ్లకు ఇంతసేపు కూర్చోవడం కష్టమే. వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు లేకపోవడంతో వృద్దులకు అసౌకర్యంగా ఉంటుంది. త్వరలో ఈ అసౌకర్యం దూరం కానుంది. వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేయనున్నామని రైల్వే శాఖ ప్రకటించింది.


2025 జూన్‌లో వందేభారత్ రైళ్ల కోసం స్లీపర్ కోచ్‌లు తయారు కానున్నాయి. అదే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తయి..2026 నుంచి అందుబాటులోకి వచ్చే విధంగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కావల్సిన స్లీపర్ కోచ్‌లను టిటాగర్ రైల్ సిస్టమ్స్ తయారు చేయనుంది. 80 వందేభారత్ స్లీపర్ రైళ్లను తయారు చేసేందుకు బీహెచ్ఈఎల్‌తో ఒప్పందం జరగనుంది. ఉత్తర్ పరా ప్లాంట్‌లో టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు 52 శాతం వాటా ఉంది.వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్ తొలి మోడల్ రెండేళ్లలో సిద్ధం కానుంది. మొదటి 8 రైళ్లు ఉత్తర్ పరా ప్లాంట్‌ల నిర్మాణం కానుండగా, మిగిలినవి చెన్నై ప్లాంట్‌లో తయారవుతాయి.


వందేభారత్ స్లీపర్ రైలును గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేట్టు తయారు చేస్తున్నారు. ఇందులో 16 కోచ్‌లు ఉంటాయి. 887 మంది ప్రయాణీకులు ప్రయాణించగలరు. మరో 120 స్లీపర్ రైళ్లను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ మరియు రష్యన్ కంపెనీ టీఎంహెచ్‌తో ఒప్పందం చేసుకోనుంది.


Also read: Hyundai Exter Vs Maruti Suzuki Fronx: హ్యూందాయ్ ఎక్స్‌టర్ vs మారుతి సుజుకి ఫ్రాంక్స్.. రెండింట్లో ఏది బెటర్ కారు ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook