Vande Bharat Sleeper Trains: దేశంలో త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. వందేభారత్ స్లీపర్ రైళ్లను బీఈఎంఎల్ నిర్మించింది. పూర్తి స్థాయిలో పరీక్షల తరువాత దేశంలోని వివిధ నగరాల మధ్య ఈ రైళ్లు ప్రవేశపెట్టనున్నారు. వృద్ధులు, రోగులకు ఇకపై వందేభారత్ స్లీపర్ రైళ్లతో మరింత సౌకర్యం కలగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వందేభారత్ స్లీపర్ రైళ్ల గురించి గత ఏడాది అక్టోబర్‌లోనే రైల్వే శాఖ ప్రకటన చేసింది. ఇవి ఆటోమేటెడ్ రైళ్లు. రాజధాని ఎక్స్‌‌ప్రెస్ కంటే మెరుగైన సౌకర్యాలు ఇందులో ఉంటాయి. రాత్రి ప్రయాణం చేసేవారికి ఈ రైళ్లు చాలా ప్రత్యేకంగా ఉండనున్నాయి. అంటే రాత్రి జర్నీని మరింత సౌకర్యవంతం చేయనున్నాయి. ముందు 10 వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. మరో 10 స్లీపర్ రైళ్లు బీఈఎంఎల్‌లో తయారుకానున్నాయి. ఈ రైళ్లు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.


రైల్వే శాఖ త్వరలో ప్రారంభించనున్న మొదటి వందేభారత్ స్లీపర్ ట్రైన్ సెట్‌కు 11 ఏసీ  3 టైర్ కోచ్‌లు , 4 ఏసీ 2 టైర్ కోచ్‌లు, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. వందేభారత్ స్లీపర్ రైళ్లలో రాజధాని వంటి రైళ్ల కంటే మెరుగైన కుషన్‌తో బెర్త్‌లు ఉంటాయి. కామన్ ఏరియాలో సెన్సార్ ఆధారిత లైటింగ్ ఉంటుంది. రైలు ప్రయాణం కుదుపుల్లేకుండా ఉంటుంది. ఫ్లోర్‌పై స్ట్రిప్ లైటింగ్ ఉండి మరింత ఆకర్షణీయంగా, మెరుగ్గా ఉంటుంది. రైళ్లలో అప్పర్ బెర్త్‌కు ఎక్కేందుకు మెట్లు అనువుగా, సౌకర్యవంతంగా డిజైన్ చేశారు. అంతేకాకుండా ఇంటీరియర్ అద్భుతంగా మలిచేందుకు క్రీమ్ , ఎల్లో, వుడ్ కలర్స్ వినియోగించారు. 


Also read: Rachna Banerjee as TMC MP Candidate: బెంగాల్ ఎంపీగా టీఎంసీ త‌రుపున బ‌రిలో దిగుతున్న బాల‌య్య హీరోయిన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook