Vande Sadharan Train: భారతీయ రైల్వేలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఓ కొత్త శకంలా చెప్పవచ్చు. గరిష్టవేగం, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ రైళ్లు వివిధ నగరాల్ని కనెక్ట్ చేస్తున్నాయి. టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు నాన్ ఏసీతో వందే సాథారణ్ రైళ్లు రానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా వందే సాథారణ రైళ్ల గురించి వివరించారు. ఎప్పుడు ఈ రైళ్లు అందుబాటులో వస్తాయో స్పష్టం చేశారు. వందేభారత్ రైళ్లు పూర్తి ఎసీ కావడంతో సాధారణంగానే టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే సామాన్యులకు ఈ రైళ్లు దూరంగానే ఉన్నాయి. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైళ్లుగా ప్రస్తుతం 34 రైళ్లు వివిధ నగరాలను కనెక్ట్ చేస్తూ తిరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఏసీ సిట్టింగ్ మాత్రమే ఉంది. అయినా వేగం, సౌకర్యం కారణంగా ప్రయాణీకుల నుంచి ఆదరణ పెరుగుతోంది. త్వరలో స్లీపర్ కోచ్‌లు సైతం అందుబాటులో రానున్నాయి. స్లీపర్ కోచ్ రైళ్లు అందుబాటులో రాగానే దూర ప్రాంతాలకు కూడా వందే భారత్ రైళ్లు తిరగనున్నాయి. 


అయితే సామాన్యులకు అందుూబాటులో ఉండేలా నాన్ ఏసీ వందే సాధారణ్ రైళ్లు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తోంది రైల్వే శాఖ. వీటిని నాన్ ఏసీ పుష్ పుల్ ట్రైన్‌గా పిలుస్తారు. అంటే రైలు ముందు, వెనుక భాగంంలో ఇంజన్లు వీటి ప్రత్యేకత. ఈ ఏడాది ఆఖరుకు అంటే డిసెంబర్ నాటికి వందే సాధారణ్ రైళ్లు ప్రారంభం కావచ్చు. ఈ నెలాఖరులో ఈ రైలు ట్రయల్ రన్ ఉంటుంది. 


వందే స్లీపర్ కోచ్‌లు తయారౌతున్న చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలోనే ఈ రైలు సిద్ధమౌతోంది. దీనికి 22 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 12 స్లీపర్ క్లాస్ కాగా, 8 జనరల్ కోచ్‌లు, 2 గార్డు కోచ్‌లు ఉంటాయి. మరోవైపు వందే మెట్రో, వందే స్లీపర్ కోచ్‌లు కూడా వచ్చే ఏడాది మార్చ్ నాటికి సిద్ధం కానున్నాయి. వందే స్లీపర్ కోచ్‌లో 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో ఏసీ 3 టైర్ కోచ్‌లు 11, 2 టైర్ ఏసీలు 4, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ 1 ఉంటాయి. 


Also read: Honda Elevate: హోండా సిటీ, ఎమేజ్‌లను తలదన్నేసిన కారు, ధర 11 లక్షలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook