Train Ticket Rules: ఒకరి టికెట్ మరొకరికి బదిలీ చేయవచ్చా, రైల్వే నియమాలు ఏం చెబుతున్నాయి
Train Ticket Rules: రైల్వే ప్రయాణాలకు సంబంధించి నిత్యం ఎన్నో సందేహాలు వస్తుంటాయి. టికెట్ క్యాన్సిలేషన్, టికెట్ ట్రాన్స్‌ఫర్, ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ ఇలా వివిధ అంశాలపై ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి. ఆటు రైల్వే శాఖ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ జారీ చేస్తుంటుంది.
అలాంటి సందేహమే ఇది. కన్ఫర్మ్ రైలు టికెట్ ఉన్నప్పుడు మరొకరికి బదిలీ చేయవచ్చా లేదా, రైల్వే నియమాలు ఏం చెబుతున్నాయి, ఒకరి టికెట్ మరొకరకి బదిలీ చేసేందుకు వీలుందా లేదా అనే సందేహాలను నివృత్తి చేద్దాం. దీనికి సంబంధించి ఇండియన్ రైల్వేస్ నియమాల్లో స్పష్టత ఉంది.
ఇండియన్ రైల్వేస్ అనేది దేశానికి ఓ లైఫ్‌లైన్ అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే రైల్వే వ్యవస్థ లేని దేశాన్ని ఊహించడం కష్టం. రోజుకు కోట్లాది ప్రయాణీకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారైతే కనీసం 3 నెలల ముందే బుకింగ్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఏదో కారణాలతో ప్రయాణం రద్దవుతుంటుంది. ఈ పరిస్థితుల్లో మీ టికెట్ పై మరో వ్యక్తి ప్రయాణం చేయవచ్చా లేదా ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం.
మీ టికెట్‌పై మరో వ్యక్తి వెళ్లవచ్చా లేదా
రైల్వే నియమాల ప్రకారం ఒకవేళ చివరి నిమిషంలో మీ ప్రయాణం రద్దైతే మీ స్థానంలో మరో వ్యక్తిని పంపించే వెసులుబాటు ఉంది. అయితే దీనికోసం మీరు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి టికెట్‌లో మార్పు చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ టికెట్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఆ తరువాత రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు వెల్లి ఓ అప్లికేషన్ ఇవ్వాలి. అందులో మీ ప్రయాణం క్యాన్సిలేషన్ కారణం వివరించాలి. దాంతోపాటు ఎవరి పేరుపై బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
48 గంటల ముందు బదిలీకు అవకాశం
ఈ దరఖాస్తుతో పాటు మీరు ఎవరినైతై మీ స్థానంలో పంపిస్తున్నారో ఆ వ్యక్తి ఆధార్ లేదా పాన్ కార్డు కాపీ ఇవ్వాలి. మీ ప్రయాణం తేదీకు 2 రోజులు ముందు ఈ మార్పు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత రైల్వే టికెట్ మీ స్థానంలో మరో వ్యక్తి పేరిట బదిలీ అవుతుంది. ఒకవేళ మీది ప్రభుత్వ ఉద్యోగమైతే..చివరి నిమిషంలో ప్రయాణం రద్దయితే 24 గంటల ముందు కూడా మార్చుకోవచ్చు.
కన్ఫర్మ్ సీటు ఉంటేనే ఈ వెసులుబాటు
రైల్వే నియమాల ప్రకారం ఈ వెసులుబాటు అంటే టికెట్ ట్రాన్స్‌ఫర్ అనేది కేవలం కన్‌ఫర్మ్ టికెట్ ఉంటేనే వర్తిస్తుంది. వెయిటింగ్ లిస్ట్ వారికి ఇది వర్తించదు. టికెట్ ట్రాన్స్‌ఫర్ చేయకుండానే మరో వ్యక్తిని మీ టికెట్‌పై పంపిస్తే టికెట్‌కు పది రెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అందరి సమక్షంలో సిగ్గు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
Also read: Best Selling Hatchbacks: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook