Indian Railways: కోట్లాదిమంది రైల్వే ప్రయాణీకులకు కావల్సిన అప్‌డేట్ ఇది. రాత్రి ప్రయాణం నియమాల్లో రైల్వేశాఖ మార్పులు చేసింది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైలు ప్రయాణం చేసేవారికి అవసరమైన అప్‌డేట్ ఇది. ఒకవేళ మీరు కూడా ట్రైన్ ద్వారా దూర ప్రయాణం ప్రాన్ చేస్తుంటే లేదా రాత్రి వేళ ప్రయాణం చేస్తుంటే నియమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయనేది గమనించాలి. రాత్రి వేళ ప్రయాణించేటప్పుడు ప్రయాణీకులు పలు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంటుంది. ప్రయాణీకుల సమస్యల్ని దూరం చేసేందుకు రైల్వేశాఖ నిబంధనల్లో మార్పులు చేసింది. 


రాత్రి వేళ రైల్వే ప్రయాణం చేసేటప్పుడు కో పాసెంజర్లు కొంతమంది ఫోన్‌లో గట్టిగా మాట్లాడటం లేదా సినిమా చూస్తుండటంతో చాలా డిస్ట్రబ్ అవుతుంటుంది. ఈ విధమైన సమస్యల్ని దూరం చేసేందుకు రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎవరైనా సరే రాత్రి వేళ ప్రయాణం సందర్భంగా ఇలాంటి పనులు చేస్తే జరిమానా విధిస్తారు. రాత్రి పడుకునే ముందు కోచ్‌లో అటూ ఇటూ తిరుగుతుంటారు. కోచ్‌లో ఇతరుల్ని డిస్ట్రబ్ చేయడం, మ్యూజిక్ వినడం చేస్తే..భారీ జరిమానా తప్పదు.


రైల్వే నియమాల ప్రకారం ఇయర్‌ఫోన్స్ లేకుండా సినిమాలు చూడటం కానీ, పాటలు వినడం గానీ చేయకూడదు. ప్రయాణీకుల సౌకర్యార్ధం రైల్వేశాఖ ఇప్పుడీ కొత్త నియమాల్ని ప్రవేశపెట్టింది. రైల్వే టీటీ రాత్రి సమయంలో ప్రయాణీకుల్ని లేపి టికెట్ లేదా ఐడీ కోసం చెక్ చేస్తుంటారు. రైల్వే నియమాల ప్రకారం రాత్రి 10 గంటల్నించి ఉదయం 6 గంటలవరకూ టీటీ ప్రయాణీకులకు అంతరాయం కల్గించకూడదు. నిద్రించే సమయంలో టీటీ మీ టికెట్ చెక్ చేయకూడదు. అయితే రాత్రి 10 గంటల తరువాత ప్రయాణించేవారికి ఈ నిబంధన వర్తించదు. 


Also read: PM Kisan Updates: 12వ వాయిదాకు ముందే ఆ మార్పు చేస్తే..మీ పీఎం కిసాన్ ఎక్కౌంట్‌లో 4 వేల రూపాయలు బదిలీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook