Indian Railways New Train: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వేలు ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశంలోని కార్మికులు బతుకుదెరువు కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లి.. కొంతకాలం అక్కడ డబ్బులు సంపాదించుకుని తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లగేజీ తీసుకుని.. జనరల్ బోగీల్లో ఇబ్బందిపడుతూ.. గంటల తరబడి ప్రయాణి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వలస కార్మికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వారి కోస ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఏయే రాష్ట్రాల్లో వలస కార్మికులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారో అధ్యయనం చేసి.. వారి కోసం ఆయా మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్‌ను నడుపుతున్నట్లు వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వలస కార్మికుల ప్రత్యేక రైలుపై ఇటీవల రైల్వే శాఖ అధ్యయనం చేసింది. సొంతూళ్లలో పనులు దొరక్క ఇతర రాష్ట్రాలకు వచ్చే వలస వెళ్లే కార్మికులు రైళ్ల కోసం ఎక్కువ సేపు వేచిచూస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా.. మిగిలిన రోజుల్లో వీరికి ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న రైళ్లలో రద్దీ భారీగా పెరుగుతోంది. 


వలస కార్మికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చే రైళ్లలో స్లీపర్, జనరల్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. వీటిలో ఏసీ కోచ్‌లు ఉండవు. ఈ రైళ్లను ఏడాది పొడవునా నడిపేందుకు రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. వీటిలో 22 నుంచి 26 వరకు కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుగా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ రైళ్లకు ఇంకా పేరును నిర్ణయించలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 


వలస కార్మికులు ఎక్కువగా ఏయే ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్నారో రైల్వే అధికారులు గుర్తిస్తున్నారు. యూపీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అస్సాం, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రైళ్లను శాశ్వత ప్రతిపాదికన నడిపేందుకు రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే.. ఇతర రైళ్లపై రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.


Also Read: Whatsapp Latest Update: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వీడియో కాల్ లిమిట్ పెంపు  


Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook