Manipur Woman Paraded Video: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు దేశం మొత్తం చలించిపోయింది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. దురదృష్టకర ఘటనను ప్రతి ఒక్కరు ఖండిస్తూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వచ్చాయి. నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు సైతం ఈ కేసును సుమోటోగా విచారణకు చేపట్టింది. ఆ కిరాతకులు బాధిత మహిళలను ఏం చేశారో అని అందరూ ఆందోళన చెందుతున్నారు.
చురచంద్‌పూర్‌లోని శరణార్థి శిబిరంలో బాధిత మహిళ (40) ఆశ్రయం పొందుతున్నారు. తనకు ఎదురైన కష్టాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. మే 3వ తేదీన తమ గ్రామంపై హింసాత్మక గుంపు దాడి చేసిందని తెలిపారు. సమీపంలోని గ్రామంలో మీతేయ్ గుంపులు ఇళ్లను తగులబెడుతున్నాని తెలియడంతో భయపడిపోయామన్నారు. తమను తాము రక్షించుకోవడానికి కుటుంబం అంతా కలిసి అడవి గుండా వెళ్లి తప్పించుకున్నామో ఆమె గుర్తుచేసుకున్నారు.
"మా నలుగురు పిల్లలను కాంగ్‌పోక్పి జిల్లాలోని నాగా గ్రామంలో ఆశ్రయం పొందేందుకు పంపించాం. నేను, నా భర్త, మరో ఎనిమిది మంది గుంపుల నుంచి తప్పించుకోవడానికి సమీపంలోని అడవిలో దాక్కున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఆ గుంపు అడ్డగించింది. మా వస్తువులన్నింటినీ తగలబెట్టింది. అందరినీ ప్రధాన రహదారి వైపునకు లాగారు. మేము రెండు గ్రూపులుగా విడిపోయాయి. వీడియోలో కనిపించిన మరో మహిళను తన సోదరుడు, తండ్రితో కలిసి మెయిన్ రోడ్డు వైపు తీసుకెళ్లారు. పురుషులను పట్టుకుని కొట్టారు.
మరో మహిళ, ఆమె తమ్ముడు ప్రధాన రహదారిపై ఆగి ఉన్న పోలీస్ జీపులో దాక్కున్నారు. అయినా ఆ గుంపు నుంచి తప్పించుకోలేకపోయారు. ఇద్దరు పోలీసులు, ఒక డ్రైవర్ ఉన్నా ఎలాంటి సహాయం అందించలేదు. పోలీసులను సాయం అడగడంతో కోపంతో ఆ మహిళ తండ్రి, సోదరుడిని కొట్టి చంపేశారు. వారి మృతదేహాలను కాలువలో పడేశారు. మమ్మల్ని రక్షించుకోవడానికి ఏది చెబితే అది చేశాం. నన్ను విడిచిపెట్టమని వారిని వేడుకున్నాను. నా బట్టలు విప్పకుంటే చంపేస్తామని బెదిరించారు. నేను తల్లిలాంటి దానిని అని వారికి చెప్పినా.. వారు కనికరం చూపలేదు" అని ఆ ఘోర దుర్ఘటనను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీరెన్ సింగ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మణిపూర్ పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నలుగురు నిందితులను 24 గంటలలోపు అరెస్టు చేశామని మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు. ఇతర నిందితులను అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
Also Read: Whatsapp Latest Update: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వీడియో కాల్ లిమిట్ పెంపు
Also Read: Hyderabad Rains: హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షపాతం.. అవస్థలు పడుతున్న జనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook