Indigo Summer Sale: ఇండిగో ఎయిర్‌లైన్స్  ప్రత్యేక డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సమ్మర్ సేల్ ప్రారంభించింది. ఈ సమ్మర్‌లో టికెటు బుక్ చేసుకుంటే రానున్న వర్షాకాలంలో కేవలం 1199 రూపాయలకే ఎక్కడికైనా వెళ్లి రావచ్చు. అంటే బస్సు, రైలు ధరల కంటే కూడా తక్కువకు విమానయానం చేసే అద్భుతమైన అవకాశం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రారంభించిన ఈ సేల్ పేరు హెలో సమ్మర్ సేల్. వర్షాకాలంలో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటే మంచి అవకాశం. ఇండిగో నుంచి అత్యంత తక్కువ ధరకు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానసేవలు అందుతాయి. కానీ ఇవాళ అంటే మే 31 ఆఖరు తేదీ. ప్రయాణం అంత అర్జంటుగా చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ బుక్ చేసుకుంటే జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. మే 29న ప్రారంభమైన ఈ సమ్మర్ సేల్ ఇవాళ ఆఖరు తేదీ. అంటే ఇవాళ్టిలోగా బుక్ చేసుకుంటే కేవలం 1199 రూపాయలే టికెట్ ఉంటుంది. దేశంలోనూ లేదా విదేశాలకు కూడా 1199 రూపాయలకే వెళ్లవచ్చు. 


హెలో సమ్మర్ ఆఫర్‌లో మరో ఆఫర్ లభిస్తోంది. సీట్ సెలెక్షన్‌పై ప్రత్యేకంగా 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అయితే సీట్ సెలెక్షన్ అనేది లభ్యతను బట్టి ఉంటుంది. ఈ ఆఫర్‌లో ఇతర ప్రొమోషనల్ స్కీమ్స్ లేదా ఆఫర్లు వర్తించవు. ఒకసారి ఒక ఆఫర్ మాత్రమే వర్తిస్తుంది. వర్షాకాలంలో ఎంజాయ్ చేసేందుకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మూడు నెలల్లో ఎక్కడికైనా వెళ్లే ఆలోచన ఉంటే అతి తక్కువ ధరకే కేవలం 1199 రూపాయలకే వెళ్లి వచ్చే అద్భుతమైన అవకాశమిది. 


సీట్ సెలెక్షన్‌లో ఇండిగో కొత్తగా మరో ఫీచర్‌ను ఇండిగో ఎయిర్‌లైన్స్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా మహిళలు పక్కన మహిళ ఉన్న సీటును ఎంచుకోవచ్చు. వెబ్ చెక్ ఇన్ సందర్బంగా మీ పక్క సీటులో మహిళ ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం ఈ సౌలభ్యం ప్రవేశపెట్టారు. 


ఇండిగో త్వరలో కొన్ని మార్గాల్లో బిజినెస్ క్లాస్ కూడా ప్రారంభించనుంది. డొమెస్టిక్ ఎయిర్ లైన్స్‌లో 60 శాతం వాటా కలిగిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇప్పటి వరకూ కేవలం ఎకానమీ తరగతే కలిగి ఉంది. ఆగస్టులో ఇండిగో సంస్థ 18 వార్షికోత్సవం సందర్భంగా బిజినెస్ క్లాస్ ప్రారంభించవచ్చు. 


Also read: Whatsapp Services: డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, మార్క్‌లిస్ట్‌లు వాట్సప్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook