My City My Heritage Walk in Hyderabad: ఇండిగోరీచ్, ఇంటర్‌గ్లోబ్ ఫౌండేషన్ హైదరాబాద్‌లోని కుతుబ్ షాహీలో తమ ఐదో హెరిటేజ్ వాక్‌ని నిర్వహించాయి. 'మై సిటీ మై హెరిటేజ్' వాక్ పేరుతో మన దేశంలో వారసత్వం, సంస్కృతి ప్రాముఖ్యత గురించి అవగాహనను ప్రోత్సహించేందుకు నిర్వహించారు. ఈ సందర్భంగా  ఇండిగో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పీటర్‌ ఎల్‌బర్స్‌  మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ప్రధాన పర్యాటక కేంద్రంగా కలకాలం నిలిచిపోయే ఆర్కిటెక్చర్‌ అని అన్నారు. సాంకేతిక పురోగమనాలు, గొప్ప సాంస్కృతిక, సుందరమైన అందాలకు ప్రసిద్ధి చెందిందని చెప్పారు. ఇండిగో హైదరాబాద్‌ను 54 దేశీయ, 13 అంతర్జాతీయ గమ్యస్థానాలకు కలుపుతోందన్నారు. తమ ఐదవ హెరిటేజ్ వాక్ ద్వారా కుతుబ్ షాహీ రాజవంశం, హైదరాబాద్ పట్టణం గొప్ప చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ మధ్యయుగ మైలురాళ్ల అన్వేషణ, పరిరక్షణకు సహకరించేందుకు తాము సంతోషిస్తున్నామని అన్నారు. భారత్‌లో ఎక్కువగా ఇష్టపడే పర్యాటకాన్ని బలోపేతం చేయడం, హైదరాబాద్ గొప్ప చరిత్రను, సంస్కృతిని అందరికి చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్‌గ్లోబ్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ రోహిణి భాటియా  మాట్లాడుతూ.. ఈసారి హైదరాబాదులో మరో విజయవంతమైన హెరిటేజ్ వాక్‌ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కుతుబ్ షాహీ కాంప్లెక్స్ హైదరాబాద్ గొప్ప సాంస్కృతిక, ప్రకృతి అందాల ఆకర్షణీయమైన చారిత్రక నేపథ్యానికి ప్రతీక అని అన్నారు. తాము కుతుబ్ షాహీ సమాధులు, సమానత్వ విగ్రహం గుండా వెళ్లే సమయంలో మన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించే అవసరాన్ని గుర్తు చేసుకున్నామన్నారు. 'మై సిటీ మై హెరిటేజ్' ప్రచారం భారతదేశ సాంస్కృతిక, చారిత్రక సంపదను పెంపొందించేందుకు ఇంటర్‌గ్లోబ్ ఫౌండేషన్ కృషి చేస్తోందన్నారు. ఈ హెరిటెజ్ వాక్‌లు భారతదేశ నిర్మిత, సహజ వారసత్వాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడం అనే లక్ష్యంతో ముందుకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 


'మై సిటీ మై హెరిటేజ్' నవంబర్ 2022లో ప్రారంభమైన విషయం తెలిసిందే. భారత్‌లోని పది నగరాలలో విభిన్న వారసత్వం, సాంస్కృతిక అంశాలను అన్వేషిస్తూ.. డాక్యుమెంట్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రెండు వందల కంటే ఎక్కువ సాంస్కృతిక ఆసక్తికర అంశాలు గుర్తించారు. కల్చరల్ మ్యాపింగ్ కథనాలు, సెల్ఫ్-గైడెడ్ ట్రైల్స్, లిస్టిల్స్, మ్యూజియం మ్యాపింగ్, కల్చరల్ క్యాలెండర్‌లు, ఫోటోగ్రఫీ మొదలైన వాటితో సహా అభివృద్ధి చేసిన మెటీరియల్ రూపంలో సేకరించారు. ప్రస్తుతం ప్రింట్, డిజిటల్ ఫార్మాట్‌లలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.


ఇంటర్‌గ్లోబ్ ఫౌండేషన్, ఇండిగోరీచ్ రెండూ భారత్‌లో వారసత్వ పరిరక్షణ, సంరక్షణను ప్రోత్సహించడానికి వివిధ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకువెళ్లాయి. ఇంటర్‌గ్లోబ్ ఫౌండేషన్ కొన్ని ప్రధాన ప్రాజెక్టులు, ఢిల్లీలోని అబ్దుర్ రహీమ్ ఖాన్-ఐ-ఖానాన్ సమాధి పరిరక్షణ, సాంస్కృతిక పునరుద్ధరణ, పది నగరాల సాంస్కృతిక మ్యాపింగ్, డాక్యుమెంటేషన్, రాజస్థాన్‌లోని దెల్వారాలోని స్టెప్‌వెల్ “ఇంద్ర కుండ్” పునరుద్ధరణనకు కృష్టి చేస్తున్నాయి. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడం, పరిశోధించడంలో, అవగాహనను పెంచడంలో సహాయపడటానికి ఇంటర్‌గ్లోబ్ ఫౌండేషన్ ఇంటర్‌గ్లోబ్ హెరిటేజ్ ఫెలోషిప్‌లను కూడా ప్రారంభించింది. హైదరాబాద్‌లోని కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్‌లోని మహమ్మద్ కుతుబ్ షా సమాధి పరిరక్షణతో పాటు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని లాల్ బాగ్ ప్యాలెస్ అంతర్గత పునరుద్ధరణ కోసం ఇండిగోరీచ్ ప్రాజెక్టులను చేపట్టింది.


Also Read: Power Bills: కేటీఆర్‌ సంచలన ప్రకటన.. కరెంట్‌ బిల్లులు కట్టొద్దని తెలంగాణ ప్రజలకు పిలుపు


Also Read: Revanth Reddy London Tour: లండన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం.. విఖ్యాత ప్యాలెస్‌లో ప్రసంగం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter