Insurance Scams: దేశంలో రోజుకో కొత్త రకం మోసం, కొత్త కుంభకోణం ఎదురౌతోంది. ఇప్పుడు కొత్తగా బీమా రంగంలో కూడా మోసాలు జరుగుతున్నాయి. డూప్లికేట్ బీమాలు పుట్టుకొస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. బీమా రంగంలో జరిగే మోసాలు ఎలా ఉన్నాయి, ఎలా గుర్తించాలనే వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఇన్సూరెన్స్ అవసరం పెరిగే కొద్దీ ఈ రంగానికి ప్రాధాన్యత అధికమౌతోంది. పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు పెరిగే కొద్దీ ఈ రంగంలో కుంభకోణాలు, మోసాలు పెరిగిపోతున్నాయి. బీమా రంగంలో మోసాలు పెరగడానికి కారణాలు లేకపోలేదు.. చాలామందికి బీమా ఉత్పత్తుల గురించి పూర్తిగా తెలియకపోవడమే ప్రధాన కారణం. ఇన్సూరెన్స్ రంగంలో పెరుగుతున్న మోసాల్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సరైన చర్యలు లేకపోవడంతో ఈ పరిస్థితి పెరుగుతోందనేది ఆర్ధిక నిపుణుల మాట. అసలు ఈ బీమా రంగ మోసాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..


బీమా రంగంలో మోసాలంటే ప్రధానంగా నకిలీ బీమా పాలసీలు ఉంటాయి. కస్టమర్‌కు నకిలీ బీమా పాలసీ సర్టిఫికేట్ అందిస్తారు. కవరేజ్ ఉండదు. తక్కువ ప్రీమియం, తప్పుడు హామీలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ రంగంలో ఎదురయ్యే మరో మోసం ఫిషింగ్ లేదా ఐడీ దొంగిలించడం. పాలసీ పేరుతోనే మరో పేరుతోనే మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ ఎక్కౌంట్, క్రెడిట్ కార్డు సమాచారం వంటివాటిని వెబ్‌సైట్, ఇమెయిల్, ఫోన్ ద్వారా సేకరిస్తారు. మీ ఐడీని కూడా దొంగిలిస్తారు. ఇలా అందరి నుంచి సేకరించిన సమాచారాన్ని అంటే మీ వ్యక్తిగత డేటాను థర్డ్ పార్టీకు విక్రయిస్తారు. ఇదే డేటా చోరీగా పిలుస్తుంటారు. ప్రీమియం చెల్లింపును బీమా ఏజెంట్లు నగదు రూపంలో తీసుకుని మోసం చేయవచ్చు. 


అందుకే కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు తెలియని వారితో మీ వ్యక్తిగత సమాచారం లేదా పాలసీ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు. చట్టబద్ధమైన బీమా కంపెనీ మీ ఒరిజినల్ డాక్యుమెంట్‌లను షేర్ చేయమని లేదా ఖాళీ చెక్కులపై సంతకాలు చేయమని కోరదని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ప్రతి బీమా పాలసీకు క్యూఆర్ కోడ్ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ కోడ్‌ని బట్టి మీ పాలసీ అసలైందో కాదో ఇట్టే తెలుసుకోవచ్చు. మీ ఫోన్‌లో ఉండే క్యూఆర్ కోడ్ రీడర్ యాప్‌తో కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. 


ఇక పాలసీలు తీసుకునేముందు ఆ డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా పరిశీలించాలి. నిబంధనలు, షరతులు, మినహాయింపుల్ని అర్దం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి సరిగ్గా ఉంటే పాలసీ సరైందని అర్ధం చేసుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైంది ఈ మెయిల్, ఫోన్ కాల్ ద్వారా మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు, క్రెడిట్ కార్డు సమాచారం వంటి  సమాచారాన్ని షేర్ చేయవద్దు. 


Also read: Independence Day 2023: ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, నేపధ్యమేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook