Independence Day 2023: ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, నేపధ్యమేంటి

Independence Day 2023: ది ఇండిపెండెన్స్ యాక్ట్. ఓ చారిత్రాత్మక డాక్యుమెంట్. బ్రిటీషు పాలనకు ముగింపుగా దేశంలో  కొత్త శకానికి నాందిగా దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే సమయానికి అంకురార్పణ జరిగిన సమయం. పూర్తి వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 8, 2023, 09:35 PM IST
Independence Day 2023: ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, నేపధ్యమేంటి

Independence Day 2023: దేశ స్వాతంత్య్ర దినోత్సవరం ప్రతి యేటా ఆగస్టు 15న జరుపుకుంటారు. బ్రిటీషు దాస్య శృంఖలాల్ని తెంచుకున్న సందర్బంగా ఆనందంతో జరుపుకునే వేడుక. 2 శతాబ్దాల బ్రిటీషు పాలనకు చరమగీతం పలికిన చారిత్రక ప్రాధాన్యత కలిగింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవపు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

స్వాతంత్య్ర దినోత్సవం ప్రాధాన్యత

ఆగస్టు 15,1947. భారత దేశ తొలి ప్రధానిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సాక్షిగా జాతీయ జెండాను ఎగురవేసిన తొలి సందర్భం. భారతదేశం స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న చారిత్రక సమయం. నిరంతర పోరాటం, అహింసా మార్గం, ఎందరో స్వాతంత్య్ర వీరులు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ తదితరుల త్యాగానికి ప్రతిఫలం లభించిన సందర్భం. స్వయం పాలన, సార్వ భౌమాధికారం, ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త శకానికి సంకేతంగా ప్రతి భారతీయుడు గుర్తుంచుకునే చారిత్రక అవసరం. 

ఆగస్టు 15 వేడుక ఎందుకు

ఆగస్టు 15,. 1947న ఇండిపెండెన్స్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. దేశ ప్రజలు ఎన్నుకునే భారత సంవిధాన అసంబ్లీకు శాసన సార్వభౌమాధికారం బదిలీ చేసిన చట్టమిదే. 1947 జూలై 18నే బ్రిటీషు పార్లమెంట్ లో ది ఇండియన్ ఇండిపెండెన్స్ చట్టం ఆమోదం పొందింది. ఏళ్ల తరబడి సాగిన దేశ స్వాతంత్య్ర పోరాటానికి ఫలితమిది. ది ఇండిపెండెన్స్ చట్టం ఓ చారిత్రక డాక్యుమెంట్. ఆ తరువాత 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం ఇస్తున్నట్టుగా బ్రిటీషు ప్రకటన. అంతే ఉదయం ఆగస్టు 15, 1947న దేశ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నారు.

Also read: Corona New Variant: యూరప్ దేశాల్ని కలవరపెడుతున్న కరోనా వేరియంట్ ఇండియా వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News