Senior Citizens Post Office Saving scheme Interest Rate 2023: దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి అన్న చందంగా.. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న ప్రతిఒక్కరు ఎంతోకొంత డబ్బును సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. రిటైర్‌మెంట్ తరువాత కూడా తమ జీవితాన్ని సంతోషకరంగా గడిపేందుకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా.. ఇప్పటి నుంచే కొంత డబ్బును పొదుపు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోస్టాఫీసు మంచి వడ్డీని ఆఫర్ చేస్తూ.. ఓ సేవింగ్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ సేవింగ్స్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బు పూర్తి సేఫ్‌గా ఉండడంతోపాటు గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. ఈ స్కీమ్ పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో మీరు పెట్టుబడిపెడితే.. మీకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ ఆదాయమే లభిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో ప్రస్తుతం 8.2 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. దీంతో మీరు డిపాజిట్ చేసిన డబ్బుతో ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.


Also Read: Ind vs Aus Day 1 Highlights: ఇది నా స్టైల్.. వెరైటీగా డీఆర్ఎస్ కోరిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్


సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌ను 60 ఏళ్లు పైబడిన లేదా వీఆర్ఎస్ తీసుకున్న వారి కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పథకంలో ఒకేసారి రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలి. తరువాత ప్రతి మూడో నెలలో రూ.10,250 ఆదాయాన్ని పొందుతారు. ఒక ఏడాదికి రూ.41 వేలు వస్తుంది. ఐదేళ్ల వరకు లెక్కిస్తే.. ఈ పథకంలో మీరు రూ.2 లక్షల వరకు వడ్డీని సంపాదించవచ్చు. మీరు జమ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్ సేఫ్‌గా ఉంటుంది. 


 


ఈ పథకంలో మంచి వడ్డీ ప్రయోజనంతో పాటు ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80సీ కింద.. ఇందులో పెట్టుబడి పెట్టడంపై ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షల ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందొచ్చు. ఈ పథకంలో అకౌంట్‌ను దేశంలోని ఏ పోస్టాఫీసుకైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇది ఇతర పెట్టుబడి పథకాల కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ పథకంలో డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లింపు ఉంటుంది. ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి నెలల్లో ఈ వడ్డీ సొమ్ము నేరుగా అకౌంట్‌లోకి జమ అవుతుంది. 


Also Read: Contract Employees: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెగ్యూలరైజ్‌కు గ్రీన్ సిగ్నల్  


60 ఏళ్లు పైబడి వారు సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే.. సమీపంలోని ఏదైనా పోస్టాఫీసు లేదా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌కి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. అక్కడ ఒక ఫారమ్‌ను నింపి.. మీ అకౌంట్ వివరాలు. ఈ ఫారమ్‌తో పాటు 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటో‌లు, గుర్తింపు రుజువు లేదా కేవైసీకి సంబంధించిన ఇతర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఆ తరువాత మీ స్టేట్‌మెంట్ ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా పంపిస్తారు.


Also Read: UPI Cash Withdrawal: ఏటీఎంలో యూపీఐ ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోండి..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook