iPhone 13 Flipkart Offer: ఈ ప్రపంచంలో 'ఆపిల్ ఐఫోన్' అంటే ఇష్టపడిన వారుండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొత్త సిరీస్ వచ్చిందంటే మొబైల్ ప్రియులు కొనుగులు చేసేందుకు ఎంతో ఆసక్తిగా చూపిస్తారు. ప్రస్తుతం ఐఫోన్ 13 సిరీస్ కోసం అందరూ ఎగబడుతున్నారు. అయితే ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇంతకంటే మంచి సమయం మరోసారి రాదు. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఓ సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. బిగ్ బచత్ ధమాల్ సేల్ (Big Bachat Dhamaal Sale)లో భాగంగా ఐఫోన్ 13ను తక్కువ ధరకు ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ ఆఫర్ జూన్ 3 నుంచి 5 వరకు మాత్రమే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు (జూన్ 3) నుంచి 'బిగ్ బచత్ ధమాల్' సేల్ ఆరంభం అయింది. ఐఫోన్ 14 త్వరలో రానున్న నేపథ్యంలో 13 ధరలను తగ్గించారు. ఐఫోన్ 13 మొబైల్ 128 GB వేరియంట్‌ అసలు ధర రూ. 79,900లు కాగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ ద్వారా 7% తగ్గింపు లభిస్తుంది. అప్పుడు 6 వేల రూపాయల తగ్గింపుతో రూ. 73,900లకు కొనుగోలు చేయవచ్చు. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. 4 వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది. దాంతో రూ. 69,999కి ఐఫోన్ 13ని మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు.


ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో లభించే డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా 10 వేల రూపాయల తగ్గింపుతో ఐఫోన్ 13 మొబైల్ 128 GB వేరియంట్‌ రూ. 69,999కి మీ సొంతం అవుతుంది. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మరో 15,500 వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. రూ.79,900 ఐఫోన్ 13 రూ.54,499లకి సొంతం చేసుకోవచ్చు. మొత్తంగా ఐఫోన్ 13పై ఏకంగా 25,500 వేల రూపాయల భారీ తగ్గింపును పొందవచ్చు.


ఐఫోన్ 13 ఫీచర్స్: 
# 5G స్మార్ట్‌ఫోన్
# A15 బయోనిక్ చిప్‌
# 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే 
# డ్యూయల్ రియర్ కెమెరా (12MP, 12MP)
# డ్యూయల్ సిమ్ 
# 3095 mAh బ్యాటరీ 


Also Read: Major Movie Review: 'మేజర్‌' సినిమా రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?


Also Read: Vikram Twitter Review: కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌' మూవీ ట్విట్టర్ రివ్యూ.. విక్రమ్‌ 2 చూసేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాం!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook