Buy iPhone SE 3 for free in Verizon: ప్రపంచంలో 'ఆపిల్ ఐఫోన్' అంటే ఇష్టపడని వారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొత్త సిరీస్ వచ్చిందంటే మొబైల్ ప్రియులు కొనుగులు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా సరసమైన ధరలో అందుబాటులో ఉన్న మూడో జనరేషన్ ఐఫోన్ ఎస్‌ఈ 3 కోసం అందరూ ఎదురుచూస్తునారు. ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఒకటి వెరిజోన్‌లో అందుబాటులో ఉంది. వెరిజోన్‌లో ఫ్రీగా ఐఫోన్ ఎస్‌ఈ 3ని పొందవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఫోన్ 12 మినీ ఫ్లాగ్‌షిప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కంటే తక్కువ ధరకు ఐఫోన్ ఎస్‌ఈ 3 లభిస్తుంది. ఇప్పటివరకు అత్యంత సరసమైన 5G ఐఫోన్‌గా ఇది మాత్రమే మార్కెట్లోలో ఉంది. A15 బయోనిక్ చిప్‌సెట్ కారణంగాఈ ఫోన్ శక్తివంతమైన డిస్‌ప్లేతో పనిచేస్తుంది. అద్భుతమైన పని తీరుతో పాటు సుదీర్ఘ బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ కెమెరా క్వాలిటీ కూడా బాగుంది. దీని ధర రూ. 33,948. తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన ఎంపిక. 


చాలా మంది ఐఫోన్ ఇతర ఫోన్ మోడల్స్‌ తరహాలోనే ఎస్‌ఈను ఒక మోడల్ అనుకుంటారు. కానీ ఎస్‌ఈ ఓ స్పెషల్ ఎడిషన్‌. యాపిల్ ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లకు భిన్నంగా.. అందరికీ అందుబాటు ధరలో ఒక ఫోన్‌ను తీసుకురావాలనే ఉద్దేశంతో ఎస్‌ఈను పరిచయం చేసింది. ఐఫోన్ ఎస్‌ఈ 3కి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే మీ సొంతం చేసుకోవచ్చు. వెరిజోన్ ఈ క్రేజీ డీల్‌ను మీకు అందిస్తోంది. అది కూడా ఎలాంటి ట్రేడ్-ఇన్ డీల్ లేకుండా. ఈ క్రేజీ డీల్‌ను ఇలా పొందాలి. 


# ముందుగా వెరిజోన్ వెబ్‌సైట్‌కు వెళ్ళాలి.
# మీకు నచ్చిన iPhone SE 3 కలర్, వేరియంట్‌ని ఎంచుకోండి
# ఆపై యాడ్ న్యూ లైన్‌పై క్లిక్ చేయండి
# ఇప్పుడు కంటిన్యూపై క్లిక్ చేసి.. నూతన వినియోగదారు ఎంపికను ఎంచుకోండి
# మీరు మీ జిప్ కోడ్‌ను నమోదు చేసి లొకేషన్‌ను నిర్ధారించాల్సి ఉంటుంది. 
# ఆ వెంటనే మీకు పలు వెరిజోన్ ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయి. iPhone SE 3ని ఉచితంగా పొందేందుకు 36 నెలల ప్లాన్ ఎంచుకోండి.
# iPhone SE 3 మీకు షిప్పింగ్ చేయబడుతుంది


Also Read: ఫెమినా మిస్ ఇండియాగా సిని శెట్టి.. నాలుగో స్థానంలో తెలంగాణ అమ్మాయి! ప్రత్యేక ఆకర్షణగా మిథాలీ


Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి ధరలు ఇవే!  


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook