Karnataka's Sini Shetty wins Miss India 2022 Title: ఫెమినా మిస్ ఇండియా 2022 కిరీటాన్ని కర్ణాటకకు చెందిన సినీ శెట్టి కైవసం చేసుకున్నారు. ముంబైలోని రిలయన్స్ జియో కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం జరిగిన 58వ ఫెమినా అందాల పోటీలలో పలు రాష్ట్రాలకు చెందిన 31 మంది ఫైనలిస్టులు పోటీ పడగా.. 21 ఏళ్ల సినీ శెట్టి టైటిల్ విజేతగా నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ రన్నరప్‌గా నిలిచారు. 2021 ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన తెలంగాణ అమ్మాయి మానస వారణాసి చేతుల మీదుగా సినీ శెట్టి కిరీటం అందుకున్నారు.
6 మంది న్యాయమూర్తుల ప్యానెల్ మధ్య ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలు జరిగాయి. మలైకా అరోరా, నేహా ధూపియా, డినో మోరియా, రాహుల్ ఖన్నా, రోహిత్ గాంధీ, షమక్ డాబర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో సినీ శెట్టి టైటిల్ విజేతగా నిలవగా.. రూబల్ షెకావత్ రన్నరప్‌గా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన షినతా చౌహాన్ మూడో స్థానంలో, తెలంగాణ అమ్మాయి ప్రజ్ఞా అయ్యగారి నాలుగో స్థానంలో, గార్గీ నందీ ఐదో స్థానంలో నిలిచారు.
ఫెమీనా మిస్ ఇండియాగా 2022 టైటిల్ కైవసం గెలుచుకున్న సిని శెట్టి ముంబైలో పుట్టి పెరిగినా.. ఆమె స్వరాష్ట్రం మాత్రం కర్ణాటకనే. 21 ఏళ్ల సినీ శెట్టి అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె ఛార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్స్ చేస్తున్నారు. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచే భరతనాట్యం నేర్చుకున్నారు. నాలుగేళ్ల వయసు నుంచే డ్యాన్స్ నేర్చుకోవడం ప్రారంభించిన సినీ శెట్టి.. పద్నాలుగేళ్ల వయసులో భరతనాట్యం పూర్తి చేశారు.
ఇప్పటివరకు మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న లారా దత్తా, సారా జేన్ డయాస్, నఫీసా జోసెఫ్, సంధ్యా ఛిబ్, రేఖ హండె, లిమారైనా డిసౌజా కర్ణాటకకు చెందినవారే. సిని శెట్టి కూడా కర్ణాటకకు చెందినవారే కావడం గమనార్హం. గ్రాండ్ ఫినాలే ఈవెంట్ స్టార్‌రి నైట్‌గా జరిగింది. ఈ షోకి మిథాలీ రాజ్, కృతి సనన్ మరియు లారెన్ గాట్లీబ్ ప్రత్యేక అతిధులుగా వచ్చారు. ప్రతిష్టాత్మక ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న నేహా ధూపియా.. 20 ఏళ్ల వేడుక జరుపుకోవడం ఈ ఈవెంట్‌లో మరో హైలైట్.
Also Read: Ante Sundaraniki OTT: 'అంటే సుందరానికీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో, ఎప్పుడు రిలీజంటే?
Also Read: Horoscope Today July 4 2022: ఈరోజు రాశి ఫలాలు.. నిరుద్యోగులు, ప్రేమిలకు శుభకాలం!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook