IRCTC Flight Ticket Booking Discount Offers: ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకునే సందర్భంలో ఏ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుందా అని అనేర రకాల వెబ్‌సైట్స్ సెర్చ్ చేస్తుంటాం. అయితే చాలా వరకు ఫ్లైట్ టికెట్స్ ఆఫర్లు ఏదో ఒక పండగ నేపథ్యంతోనో లేక ప్రత్యేక సందర్భాలతోనో ముడిపడి ఉంటాయి కానీ సంవత్సరం పొడుగునా ఆఫర్స్ అయితే వర్తించవు. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే ఈ మార్గం మాత్రం మీకు ఎల్లప్పుడూ డిస్కౌంట్ ఆఫర్స్ అందివ్వడంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఆ మార్గం ఏంటో తెలుసుకుందాం రండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకే ఒక్క సంస్థ భారీ డిస్కౌంట్‌తో పాటు రూ. 50 లక్షల వరకు ఫ్రీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తోంది అంటే నమ్ముతారా ? భారీ డిస్కౌంట్ ఇవ్వడమే కష్టం.. ఇక 50 లక్షల రూపాయల వరకు ఉచితంగా ప్రయాణ బీమా కూడా అందివ్వడం అంటే కచ్చితంగా అది అసాధ్యమే అవుతుంది అని అనుకుంటున్నారా ? అయితే మీరు పొరపడినట్టే అవుతుంది. ఎందుకంటే IRCTC నిజంగానే అలాంటి ఎగ్జైటింగ్ ఆఫర్ అందిస్తోంది. 


ఐఆర్‌సిటిసి ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్ యాప్ ద్వారా టిక్కెట్స్ బుక్ చేసుకునే వారికి ఈ బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అవును, మీరు చదివింది నిజమే. ఐఆర్‌సిటిసి అధికారిక ఫ్లైట్ టికెట్ బుకింగ్ యాప్  IRCTCAir ద్వారా విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అది కూడా ఒక్కసారి లేక రెండు సార్లు వర్తించే లిమిటెడ్ ఆఫర్ కాదు.. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న ప్రతిసారీ మీకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అవును.. ఎప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న ప్రతీసారి.. భారీ డిస్కౌంట్ తో పాటు 50 లక్షల రూపాయల వరకు ఉచిత విమాన ప్రయాణ బీమా లభిస్తుంది. 



 


ఇది కూడా చదవండి : Maruti Suzuki Fronx: ఫ్రాంక్స్ కారు ధర.. మైలేజ్.. ఇంజన్.. ఫీచర్స్.. దర్జాలో రారాజు.. ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!


ఏంటి ఇంకా నమ్మలేకపోతున్నారా ? అయితే ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్  http://air.irctc.co.in లోకి విజిట్ చేయండి. లేదా ఐఆర్‌సిటిసి అధికారిక మొబైల్ యాప్ IRCTC Air యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని చెక్ చేయండి. ఇండియన్ రైల్వేస్ చెందిన ఈ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ కస్టమర్స్‌ని ఆకట్టుకోవడం కోసం విమాన టిక్కెట్ బుకింగ్స్ పై సైతం ఆఫర్స్ అందిస్తోంది. మీ వద్ద IRCTC SBI ప్రీమియర్‌ కార్డ్ ఉన్నట్లయితే, ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్‌పై 5% క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. ఇది కాకుండా, ఎప్పటికప్పుడు ఇలాంటి ఎన్నో ఇతర ఆఫర్లు కస్టమర్స్ కోసం ఐఆర్‌సిటిసి వద్ద రెడీగా ఉంటాయి.


ఇది కూడా చదవండి : Ola S1 Pro Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK