IRCTC Tour Packages: ఐఆర్‌సీటీసీ సరికొత్త ఆఫర్.. తక్కువ బడ్జెట్‌లో ఈ ప్రాంతాలను చూసేయండి

Irctc Kashmir Tour Package: వేసవిని దృష్టిలో ఉంచుకుని ఐఆర్‌సీటీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్లు తీసుకువస్తోంది. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రదేశాలను తక్కువ బడ్జెట్‌లోనే సందర్శనకు తీసుకువెళుతోంది. వివరాలు ఇలా.. 

  • Mar 19, 2023, 14:36 PM IST
1 /5

ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీ పేరు జన్నత్ ఈ కాశ్మీర్. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులు విమానంలో ప్రయాణిస్తారు. ఈ టూర్‌లో స్థానిక ప్రదేశాలను సందర్శించడానికి ప్రయాణికులకు వాహన సౌకర్యం కూడా కల్పిస్తుంది ఐఆర్‌సీటీసీ.  

2 /5

ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులు శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్ తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా మీరు తక్కువ బడ్జెట్‌లో కాశ్మీర్ మైదానాల్లో ప్రయాణించవచ్చు. ప్రయాణికులకు వసతి, భోజన ఏర్పాట్లు ఉచితంగా ఉంటాయి.  

3 /5

ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ టూర్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది.  

4 /5

ప్యాకేజీలో ఒంటరిగా ప్రయాణించేందుకు రూ.60,100 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు అయితే.. మీరు ఒక్కొక్కరికి రూ.44,900 చెల్లించాలి. ముగ్గురితో కలిసి ప్రయాణించేందుకు ఒక్కొక్కరికి రూ.44,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.  

5 /5

ఈ టూర్ ప్యాకేజీ గురించి మరింత సమాచారం తెలుసుకోవాడనికి మీరు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. టూర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది..? ఏయే సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి..? వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.