Railway Enqury Numbers: ప్రస్తుతం మన దేశంలో రైళ్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దూర ప్రయాణాలకు చాలా మంది రైలును ఎంచుకుంటారు. ముందుగానే బెర్త్ బుక్‌ చేసుకుని.. తక్కువ ధరలోనే హాయిగా పడుకుని సురక్షితంగా వెళ్లే అవకాశం ఉంటుండడంతో ఎక్కువమంది ట్రైన్ జర్నీకే మొగ్గు చూపుతున్నారు. రైల్వే శాఖ కూడా ప్రయాణిలకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. అయినా ప్రయాణికులు కొన్నిసార్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న రైల్వే టిక్కెట్ బుకింగ్, ఇతర సౌకర్యాల గురించి చాలామంది ప్రయాణికులకు పూర్తిగా అవగాహన లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రయాణికులకు కావాల్సిన సమాచారం ఆన్‌లైన్‌లో ఉన్నా.. ఫోన్ ద్వారా తెలుసుకునే సదుపాయం కల్పిస్తోంది రైల్వే శాఖ. ఆన్‌లైన్‌లో సమాచారం చాలామందికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులు ఈ నంబర్ల ద్వారా చాలా సహాయం పొందవచ్చు. ఈ ఫోన్ నంబర్లను ప్రజలు అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసింది.


ట్రైన్ స్టాటస్ తెలుసుకునేందుకు.. పీఎన్ఆర్ స్టాటస్ చెక్ చేసుకోవడానికి.. ఈ నంబర్‌లను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఏ విషయంపై అయినా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే రైల్వే శాఖ నంబరకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణ సమయంలో క్యాటరింగ్ లేదా ఈ-క్యాటరింగ్ ప్రయోజనాన్ని పొందడానికి కూడా నంబర్లు అందుబాటులో ఉన్నాయి. ఏ సేవకు ఏ నంబర్లు ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకోండి.


==> 139 (పీఎన్ఆర్/రైలు రద్దు/ఫేర్ ఎంక్వైరీ, బెర్త్ లభ్యత, ట్రైన్ స్టాటస్)
==> 138 (ఫిర్యాదు సంఖ్య) 1800111139 (జనరల్ ఎంక్వైరీ)
==> 1800111322 (రైల్వే పోలీస్)
==> 1800011321 (కేటరింగ్ ఫిర్యాదు లేదా సూచన)
==> 155210 (విజిలెన్స్)
==> 182 (పిల్లల, మహిళల కోసం హెల్ప్‌లైన్)
==> 1512 (రాష్ట్ర జోనల్ వారీగా రైల్వే పోలీస్)
==> 1098 (తప్పిపోయిన పిల్లల సహాయం కోసం..)
==> 1323 (ఈ-కేటరింగ్)


Also Read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్‌ యూటర్న్..? తాజా వ్యాఖ్యలతో కొత్త ట్విస్ట్..!  


Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook