Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రయోగం కౌంట్‌డౌన్‌కు వారం రోజులు, ఇస్రో సవాళ్లను అధిగమించేనా
Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మక మిషన్ కోసం రంగం సిద్ధమౌతోంది. అదే చంద్రయాన్ 3. మరో వారం రోజుల్లో జరగనున్న ఈ ప్రయోగంవైపు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.
Chandrayaan 3: ఇస్రో సరికొత్త మిషన్ కోసం సిద్ధమైంది. మరో వారం రోజుల్లో శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 ప్రయోగించనున్నారు. చంద్రయాన్ 2 చివరి నిమిషంలో ఫెయిల్ కావడంతో ఈ ప్రయోగంపై సవాళ్లతో పాటు ఒత్తిడి కూడా అధికమైంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో జూలై 13 వతేదీన ఏపీలోని శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 ప్రయోగించనుంది. రెండు నెలలు సాగే ప్రయోగమిది. చంద్రయాన్ 3 మిషన్ వ్యోమనౌక 2నెలు ప్రయాణించిన తరువాతే చంద్రుడిపై అడుగుపెట్టనుంది. 2008 అక్టోబర్‌లో జరిగిన చంద్రయాన్ 1 ద్వారా ఇండియా తొలిసారి చంద్రుడిపై కాలుమోపింది. చంద్రుడిపై ఒకప్పుడు నీరుండిన ఆనవాళ్లను ఇండియా అప్పట్లో గుర్తించింది. ఇక చంద్రయాన్ 1కు కొనసాగింపుగా 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 చివరి నిమిషంలో విఫలమైంది. చంద్రయాన్ ల్యాండర్, రోవర్ రెండూ క్రాష్ అయ్యాయి. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ ఇస్రోకు గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచం ముందు ఇండియా ఒక్కసారిగా చిన్నబోయింది. అందుకే ఈసారి చంద్రయాన్ 3 విజయవంతం కావడంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఒత్తిడి, సవాళ్లు కూడా అదికమయ్యాయి.
ఎందుకంటే చంద్రుడు లేదా మరే ఇతర గ్రహంపై ల్యాండింగ్ చేయాలన్నా చాలా అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. నావిగేషన్., ఫ్లైట్ డైనమిక్స్, లోడింగ్ సైట్ క్లియర్ ఇమేజ్, స్పేస్ క్రాప్ట్ వంటి అంశాలు మిషన్‌పై ప్రభావం చూపిస్తాయి. వ్యోమనౌక పైకి వెళ్తూ విడిపోయినప్పుడు ల్యాండర్ వేగం తగ్గించడం అత్యంత కీలకం. ఈ వేగం సెకనుకు మూడు మీటర్ల వరకూ తగ్గించాల్సి ఉంటుంది.య లేకపోతే మరోసారి ఫెయిల్ అవుతుంది.
ఈ అంశాలకు తోడు చంద్రునిపై వాతావరణం ఎలా ఉంది, భూమిపై గురుత్వాకర్షణ శక్తి , అంతరిక్ష నౌక వేగం ఎంత ఉంది వంటి అంశాల్ని లెక్కించి మరీ ప్రయోగం జరపాల్సి ఉంటుంది. ఈ లెక్కల్లో ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తం బెడిసికొడుతుంది. ఈ సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటే చంద్రయాన్ 3 విజయవంతం కావడం పెద్ద కష్టమేం కాదు.
Also read: Maruti Suzuki Invicto Launch: మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చేసింది, ఊహించని ధరతో షాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook