IT Jobs Offers: ఇలాంటి జాబ్స్ విషయంలో జర జాగ్రత్త!
IT Jobs Offers: ఐటీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. దీనితో ఐటీ శాఖ అప్రమత్తమై ఉద్యోగాల నియామకాలపై క్లారిటీ ఇచ్చింది.
IT Jobs Offers: ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ విభాగం) మంగళవారం నకిలీ ఉద్యోగాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఇటీవల ఐటీలో ఉద్యోగాల పేరుతో మోసాలు జరుగుతున్నట్లు గుర్తించి ఈ మేరకు ఈ ప్రకటన చేసింది.
ఐటీ జారీ చేసిన పబ్లిక్ నోటీసును ట్విట్టర్ హ్యాండిల్లో కూడా షేర్ చేసింది.
నోటీసులో ఏముందంటే..
ఐటీ శాఖలో చేరేందుకు నకిలీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది ఐటీ విభాగం. నకిలీ అపాయిట్మెంట్స్తో కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారని.. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఐటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేర్పిస్తామంటూ.. డబ్బులు అడుగుతున్నారని తెలిపింది. అలాంటి ఆఫర్లను అస్సలు నమ్మొద్దని స్పష్టం చేసింది.
ఐటీ డిపార్ట్మెంట్లో ఎంపిక ఎలా ఉంటుంది?
ఐటీ డిపార్ట్మెంట్ జారీ చేసిన నోటీస్ ప్రకారం.. ఐటీ డిపార్ట్మెంట్లో చేరాలనుకునే వారికి గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్ట్ పోస్ట్‌లకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. ఎస్ఎస్సీ పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఐటీ డిపార్ట్మెంట్లో గ్రూప్ బి, సీ పోస్టులకోసం.. నోటిఫికేషన్, ఫలితాలు అన్నీ ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించింది.
ఐటీ వెబ్సైట్లో ఎంపికైన అభ్యర్థుల పేర్లు..
ఎస్ఎస్ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల పేర్లు, కేటాయించిన ప్రాంతాల జాబితాను ఐటీ అధికారిక వెబ్సైట్ (https:// incometaxindia.gov.in)లో అప్లోడ్ చేస్తారని ఐటీ శాఖ పేర్కొంది.
ఎస్ఎస్సీ, ఐటీ వెబ్సైట్లలో తప్పా..
ఎస్ఎస్సీ, ఐటీ వెబ్సైట్లలో తప్పా.. మరే ఇతర ప్లాట్‌ఫామ్‌లపైన కూడా.. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలకు సంబంధించి వచ్చే ఉద్యోగ నియామకాల సమాచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది ఐటీ శాఖ.
Also read: LPG Price Hike: సామాన్యులపై మరో భారం.. రెట్టింపు అవ్వనున్న గ్యాస్ సిలిండర్ ధర.. ఎప్పటినుండంటే..??
Also read: Smart Phones: రూ.15 వేల లోపు బెస్ట్ కెమెరా ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్స్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook