LPG Price Hike: సామాన్యులపై మరో భారం.. రెట్టింపు అవ్వనున్న గ్యాస్ సిలిండర్ ధర.. ఎప్పటినుండంటే..??

LPG Price Hike: ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ కొరత కారణంగా సీఎన్‌జీ, పీఎన్‌జీ, విద్యుత్ ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ లో ఏర్పడిన సంక్షోభం కారణంగా వీటి ధరలు పెరగనున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 06:32 PM IST
  • సామాన్యుడిపై పడనున్న మరో భారం
    మళ్లీ పెరుగుతున్న పెట్రో-డీజిల్ ధరలు
    రెట్టింపు అవనున్న గ్యాస్ సిలిండర్ ధరలు
LPG Price Hike: సామాన్యులపై మరో భారం.. రెట్టింపు అవ్వనున్న గ్యాస్ సిలిండర్ ధర.. ఎప్పటినుండంటే..??

LPG Price Hike due to Ukraine crisis: పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలకు మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే పెట్రో- డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారుల జేబులకు చిల్లులు పడనుంది. ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడటం.. దీని ప్రభావం మన దేశంపై ఏప్రిల్ నెల నుండి పడనుండటంతో వంట గ్యాస్ ధరలు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ కొరత 
కేవలం మన దేశంలోనే  కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిన కారణంగా CNG, PNG మరియు విద్యుత్ ధరలు పెరగనున్నాయి. కర్మాగారాలలో ఉత్పత్తి పెరిగినప్పటికీ.. వాడే వారి సంఖ్య కూడా పెరిగిన కారణంగా కొరత ఏర్పడనుంది. వీటితో పాటుగా ప్రభుత్వ ఎరువుల సబ్సిడీ బిల్లు పెరిగే అవకాశం లేకపోలేదు. వీటన్నిటి కారణంగా సాధారణ సామాన్య వినియోగదారుడిపైనే పూర్తి భారం పడబోతోంది.

తగినంత సరఫరా లేకపోవటం!
ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరాలో రష్యా ప్రధాన వనరుగా ఉంది, కానీ ఉక్రెయిన్ లో ఏర్పడిన సంక్షోభం కారణంగా, గ్యాస్ సరఫరా ప్రభావితం అవ్వవచ్చు. ఇప్పుడిప్పుడే, కరోనా సంక్షోభం నుండి ప్రపంచ దేశాలు కోలుకుంటున్న తరుణంలో.. వనరుల వినియోగం పెరగవచ్చు. కానీ వినియోగానికి తగిన ఉత్పత్తి లేకపోవటం కారణంగా గ్యాస్ ధరలు రెట్టింపు అవ్వొచ్చు. 

దేశీయ ధరల్లో మార్పు తర్వాత ప్రభావం.. 
ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం కనిపిస్తున్న కారణంగా సర్వత్రా ఈ ప్రభావం చూపనుంది. పెట్రో- డీజిల్ ధరలు ధరలతో పాటూ, గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. గ్యాస్ కొరత మరియు దాని ధరలో పెరుగుదల సంబంధిత మార్పులన్నీ..  ఏప్రిల్ నుండి కనపడనుంది. ప్రభుత్వం దేశీయ సహజ వాయువు ధరలను మార్చనునున్న కారణంగా నిపుణుల అభిప్రాయం ప్రకారం, వీటి ధరలు ఇప్పటికి ఉన్న వాటితో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News