IT refunds AY22: రూ.1.59 కోట్ల ఐటీ రీఫండ్స్ చెల్లింపు పూర్తి.. మీకూ వచ్చిందో తెలుసుకోండిలా..!
IT refunds AY22: 2021-22 మదింపు సంవత్సరానికి సంబంధించి రూ.1.59 లక్షల కోట్లకుపైగా ఐటీ రీఫండ్స్ చేసింది ఐటీ విభాగం. పూర్తి వివరాలివే..
IT refunds AY22: ప్రస్తుతం మదింపు సంవత్సరం (2021-22) ఇప్పటి వరకు.. రూ.1,59,192 ఐటీ కోట్ల రీఫండ్స్ చెల్లింపులు పూర్తయినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. మొత్తం 1.74 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు గానూ ఈ మొత్తం రీఫండ్ చేసినట్లు (IT refunds) పేర్కొంది.
2021 ఏప్రిల్ 1 నుంచి జనవరి 17 మధ్య కాలంలో ఈ మొత్తం రీఫండ్స్ చెల్లింపులు పూర్తి చేసినట్లు సీబీడీటీ వివరించింది.
ఇందులో 1,72,01,502 మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రూ.56,765 కోట్లను చెల్లించినట్లు పేర్కొంది (CBDT on IT Refunds) సీబీడీటీ. అదే విధంగా 2,22,774 కార్పొరేట్లకు గానూ రూ.1,02,428 కోట్లను రీఫండ్ చేసినట్లు వివరించింది.
రీఫండ్ ఎలా చెక్ చేసుకోవాలి?
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఒక సంవత్సరంలో చెల్లించాల్సిన.. పన్నుకంటే అధికంగా చెల్లిస్తే.. ఐటీ విభాగం ఆ మొత్తాన్ని తిరిగి ఆయా వ్యక్తులకు చెల్లిస్తుంది. దీనినే ఐటీ రీఫండ్ అంటారు. అయితే అధనంగా చెల్లించిన మొత్తానికి సంబంధించి సరైన ఆధారాలు సమర్పించాల్సి (What is IT refund) ఉంటుంది.
రీఫండ్ వచ్చిందో లేదో.. ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్ 2.0లో చెక్ చేసుకోవచ్చు.
ముందుగా ఈ-ఫైలింగ్ పోర్టల్ 2.0లోకి లాగిన్ అయిన తర్వాత.. అందులో రిటర్న్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో మై అకౌంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అందులో అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్‌పై క్లిక్ చేయాలి. ఆదాయపు పన్ను రిఫండ్ స్టేటస్‌తో(IT Refund Status) పాటు రిటర్న్ వివరాలు పేజీపై కన్పిస్తాయి.
పన్ను చెల్లింపుదారు రిఫండ్ డబ్బును నేరుగా వారి ఖాతాకే క్రెడిట్ చేస్తారు. లేదా చెక్ ద్వారా గానీ డీడీ రూపంలో గానీ ఇంటి అడ్రస్ పంపిస్తారు. అందుకే ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ వంటివి తప్పులు (IT refund full details) లేకుండా చూసుకోవాలి.
Also read: Stock Market today: వారాంతంలోనూ స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్ 427 మైనస్
Also read: Cryptocurrency: పడిపోతున్న క్రిప్టోకరెన్సీ ధర, రష్యా ప్రభుత్వ నిషేధ ప్రకటన ఫలితమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook