Stock Market today: వారాంతంలోనూ స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్​ 427 మైనస్​

Stock Market today: స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు (శుక్రవారం) నష్టాలతో (stocks closing bell) ముగిశాయి. సెన్సెక్స్ 59,050 దిగువకు చేరింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 03:57 PM IST
  • నాలుగో రోజూ కొనసాగిన బేర్​ పంజా
  • ఆర్థిక, ఐటీ షేర్లలో అధికంగా నష్టాలు
  • కరోనా భయాలూ కారణమంటున్న నిపుణులు
Stock Market today: వారాంతంలోనూ స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్​ 427 మైనస్​

Stock Market today: స్టాక్ మార్కెట్లు వారాంతంలోనూ (stocks closing bell) నష్టాలతో ముగిశాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 427 పాయింట్లు తగ్గి 59,037 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 140 పాయింట్ల నష్టంతో 17,617 వద్ద స్థిరపడింది.

మార్కెట్లు నష్టాలతో ముగియటం ఇది వరుసగా నాలుగో సెషన్​ కావడం గమనార్హం.

అంతర్జాతీయ ప్రతికూలతలకు తోడు కరోనా భయాలు కూడా స్టాక్ మార్కెట్లను నష్టాల బాట పట్టించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

నేటి సెషన్​లో ఆర్థిక, ఐటీ రంగాల్లోని షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​  59,329 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో  58,620 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,707 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,485 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 8 కంపెనీలు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. మిగతా 22 కంపెనీలు డీలా పడ్డాయి.

హెచ్​యూఎల్​ 2.68 శాతం, మారుతీ సుజుకీ 1.80 శాతం, హెచ్​డీఎఫ్​సీ 1.02 శాతం, నెస్లే ఇండియా 0.95 శాతం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 0.73 శాతం లాభాలను గడించాయి.

బజాజ్ ఫిన్​సర్వ్​ 5.37 శాతం, టెక్ మహీంద్రా 4.44 శాతం, టాటా స్టీల్​ 3.18 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 2.83 శాతం, ఇండస్​ ఇండ్​ బ్యాంక్ 2.77 శాతం నష్టపోయాయి.

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. హాంగ్​ సెంగ్​ (హాంకాంగ్​) సూచీ మాత్రమే లాభాలను గడించింది.

షాంఘై (చైనా), టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​ సూచీలు నష్టపోయాయి.

రూపాయి విలువ..

డాలర్​తో పోలిస్తే రూపాయి 09 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.41 వద్ద (Rupee Value today) కొనసాగుతోంది.

Also read: Todays Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Also read: Cryptocurrency: పడిపోతున్న క్రిప్టోకరెన్సీ ధర, రష్యా ప్రభుత్వ నిషేధ ప్రకటన ఫలితమేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News