ITR Filing: ఇన్‌కంటాక్స్ గడువు తేదీ జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా..మిస్సైతే ఏమౌతుంది
ITR Filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా..గడువు తేదీ ముగిసిపోయింది. మరిప్పుడు ఏం చేయాలి. జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేయనివాళ్లు ఏం చేయాలో పరిశీలిద్దాం..
ITR Filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా..గడువు తేదీ ముగిసిపోయింది. మరిప్పుడు ఏం చేయాలి. జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేయనివాళ్లు ఏం చేయాలో పరిశీలిద్దాం..
2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసే ఆఖరు తేదీ ముగిసిపోయింది. జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంది. మరి జూలై 31 లోగా ఫైల్ చేయనివాళ్ల పరిస్థితి ఏంటి, ఏం చేయాలి. ఇప్పుుడు మరో అవకాశముందా లేదా. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..ఒకవేళ మీరు జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటే ఫరవాలేదు. ఫైల్ చేయకపోతే మాత్రం డిసెంబర్ 31వ తేదీ అంటే మరో ఆరు నెలలు అవకాశముంది కానీ లేట్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అపరాధ రుసుము ఎంత చెల్లించాలనేది ఇప్పుడు చూద్దాం..
అపరాధ రుసుము ఎంత
అపరాధ రుసుము వార్షిక ఆధాయాన్ని బట్టి ఉంటుంది. మీ వార్షిక ఆదాయం 5 లక్షలుంటే లేట్ ఫీ 1000 రూపాయలు చెల్లించాలి. ఒకవేళ వార్షిక ఆదాయం 5 లక్షలకంటే ఎక్కువుంటే మాత్రం లేట్ ఫీ 5 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మొత్తం ఆదాయం కనీస పరిమితి దాటకపోతే లేట్ ఫీ లేకుండా రిటర్న్స్ పైల్ చేయవచ్చు.
ఇన్‌కంటాక్స్‌లో మీరు ఎంచుకునే ప్లాన్‌ను బట్టి కనీస పరిమితి ఉంటుంది. పాత పద్ధతిలో కనీస పరిమితి 60 ఏళ్లలోపైతే 2.5 లక్షల రూపాయలుగా ఉంది. 60-70 ఏళ్లుంటే కనీస పరిమితి 3 లక్షల వరకూ ఉంది. 80 ఏళ్లకంటే ఎక్కువైతే కనీస పరిమితి 5 లక్షల వరకూ ఉంది. అదే కొత్త ప్లాన్ ప్రకారం వయస్సుతో సంబంధం లేకుండా..కనీస పరిమితి 2.5 లక్షల రూపాయలుంది.
జూలై 31 గడువు తేదీలోగా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే..డిసెంబర్ 31, 2022 లోగా అపరాధ రుసుముతో ఫైల్ చేయాల్సి ఉంటుంది. అప్పటికీ అంటే డిసెంబర్ 31 నాటికి కూడా ఫైల్ చేయకపోతే ఇన్‌కంటాక్స్ కమీషనర్‌కు అప్పీల్ చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook