Gold Price Today August 1: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్థిరంగా బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే

August 1st 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,490గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 1, 2022, 08:49 AM IST
  • స్థిరంగా బంగారం ధర
  • నేటి బంగారం-వెండి రేట్లు ఇవే
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
Gold Price Today August 1: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్థిరంగా బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే

Gold Price Today August 1st: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఒక రోజు పసిడి రేట్లు పెరిగితే, మరో రోజు తగ్గుతాయి.. ఇంకోరోజు స్థిరంగా ఉంటాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, డాలర్ విలువ, వివిధ దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే బంగారం ధరలు ఎంత పెరిగినా లేదా తగ్గినా వ్యాపారం మాత్రం జోరుగానే ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే కొనుగోలు దారులు దుకాణాలకు క్యూ కడతారు. 

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. 10 రోజుల క్రితం తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. 4-5 రోజులుగా పెరుగుతూ వచ్చాయి. అయితే గత రెండు రోజులుగా మాత్రం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (ఆగష్టు 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 47,200లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,490లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై.. 24 క్యారెట్ల ధరపై ఎలాంటి మార్పు లేదు.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,660గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,490గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,530 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,250.. 24 క్యారెట్ల ధర రూ. 51,540గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 46,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,160గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,490గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 47,200.. 24 క్యారెట్ల ధర రూ. 51,490గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 47,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,490 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 58,400లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 63,700లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ. 63,700లుగా కొనసాగుతోంది. 

Also Read: Monkeypox Death: భారత్‌లో తొలి మంకీపాక్స్‌ మరణం.. కేరళలో కలకలం! పాజిటివ్ వచ్చినా చెప్పకుండా  

Also Read: Shamshabad Road Accident: శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ లీడర్ కుమార్తె మృతి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News