IT Returns: ఐటీ రిటర్న్స్‌లో తప్పులకు నోటీసులొస్తే ఏం చేయాలి, సరిచేసే అవకాశముందా
IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే గడువు అయిపోయింది. రిటర్న్స్ ఫైల్ చేసేశాం కదా అని చేతులు దులిపేసుకోవద్దు. అందులో తప్పులుండవచ్చు. అవి సరి చేసుకోకపోతే మళ్లీ జరిమానా తప్పదు. ఆ వివరాలు మీ కోసం..
IT Returns: ట్యాక్స్ పేయర్‌గా ఉన్న ఉద్యోగి లేదా వ్యాపారి ప్రతి యేటా తప్పనిసరిగా చేయాల్సింది ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం. ఇవి ఫైల్ చేసేటప్పుడు సాంకేతిక అంశాలతోనో లేదా ఫామ్ 16 పొరపాట్ల వల్లనో తప్పులు దొర్లుతుంటాయి. ఇవి సరిచేసుకోకపోతే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఒకవేళ తప్పులుంటే ఎలా సరి చేసుకోవాలో తెలుసుకుందాం..
మీ ఆదాయం ట్యాక్స్ పరిధిలో వస్తే ప్రతి యేటా జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. 2022-23 ఆర్ధిక సంవత్సరం రిటర్న్స్ ఫైల్ చేసేందుకు గడువు కాస్తా ముగిసింది. మీరు ఇప్పటికే ఫైల్ చేసుంటే తప్పులేమైనా ఉన్నాయో లేవో సరిచూసుకోవడం మంచిది. లేకపోతే పెనాల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తప్పులున్నాయో లేవో మీరు చూసుకోవల్సిన అవసరం కూడా లేదు. మీకు తెలియకపోయినా ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుతాయి. నోటీసులు వచ్చాయేంటని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏవైతే తప్పులున్నాయో అవి సరి చేస్తే చాలు. పాన్ నెంబర్, ఐటీఆర్ పేర్ల స్పెల్లింగ్ తేడాలు, చలాన్ నెంబర్ రాంగ్ అసెస్‌మెంట్, రాంగ్ టీడీఎస్, ఫామ్ 26ఏఎస్, ఫామా్ 16లో సరైన సమాచారం లేకపోవడం వంటివి జరగవచ్చు.
అంటే ఆదాయం, టీడీఎస్ మధ్య బ్యాలెన్స్ , ట్యాక్స్ ఆడిట్ లేకుండా ట్యాక్స్ పేమెంట్ వంటిని ఐటీఆర్ తప్పులుగా పరిగణిస్తారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పుల్ని సరిచేసుకునే అవకాశం కల్పిస్తుంది ఇన్‌కంటాక్స్ శాఖ. దీనికోసం రెక్టిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. ఐటీఆర్ డిఫెక్టివ్ అని తేలితే అసెస్‌మెంట్ సంవత్సరంలో గడువు ఇంకా ముగియకపోతే రెండు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ఒకటి రివైజ్డ్, రెండవది కొత్తగా మళ్లీ ఐటీఆర్ ఫైల్ చేయడం.
అయితే ఇక్కడో విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇన్‌కంటాక్స్ శాఖ చెల్లించే నోటీసులకు రెస్పాండ్ కావల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను నియమాల ప్రకారం నిర్ధిష్ట పరిస్థితుల్లోనే అప్‌డేటెడ్ ఐటీఆర్‌కు అవకాశముంటుంది. నోటీసులో సూచించిన తప్పుల్ని సరి చేసేందుకు 15 డే విండో ఉంటుంది. నోటీసులకు రెస్పాండ్ కాకపోతే మాత్రం ఐటీఆర్ చెల్లనిదిగా పరిగణిస్తారు. అందుకే రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఫైల్ చేసిన సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించడం చాలా అవసరం. అన్నీ సరి చూసుకున్న తరువాతే ఫైల్ చేయాలి.
సాధ్యమైనంతవరకూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ట్యాక్స్ ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడం అవసరం. ఏ విధమైన తప్పులు దొర్లకుండా, తరువాత ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఉంటుంది.
Also read: iPhone 15 Launch Date: ఐఫోన్ 15 లాంచ్ తేదీ ఖరారు, ప్రీ ఆర్డర్, స్టోర్ లాంచింగ్ తేదీలు ఇవే, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook