Buying TV, Cars, Fridges: టీవీలు, కార్లు, ఫ్రిడ్జిలు కొంటున్నారా ? అయితే తస్మాత్ జాగ్రత్త.. డబ్బు విషయంలో కొంచెం ఆచూతూచీ ఖర్చుపెట్టండి అని వినియోగదారులకు అమేజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సూచిస్తున్నారు. అనవసర వృథా ఖర్చులను తగ్గించి, డబ్బులు ఆదా చేసుకోండి. లేదంటే ఆర్థిక మాంధ్యంలో లేనిపోని ఇబ్బందులు తప్పవు అని జెఫ్ బెజోస్ హెచ్చరిస్తున్నారు. అయితే, అమేజాన్ ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ పై అనేక రతాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తూ అమేజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ లైవ్ అయిన రోజే జెఫ్ బెజోస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా అమేజాన్ ఓవైపు హోమ్ అప్లయెన్సెస్ నుండి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వరకు అనేక రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు అదే అమేజాన్ సంస్థ వ్యవస్థాపకులు అనవసర ఖర్చులు తగ్గించుకోండి అని సూచించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎన్ఎన్ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జెఫ్ బెజోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంధ్యం మేఘాలు కమ్ముకునే ప్రమాదం ఉందని గ్లోబల్ కార్పొరేట్ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే జెఫ్ బెజోస్ ప్రపంచ వినియోగదారులకు ఈ హెచ్చరిక చేశారు. ఒకవేళ ప్రపంచం ఆర్థిక మాంధ్యంలో కూరుకుపోతే.. నేటి పొదుపే రేపటి అవసరాలకు పనికొస్తాయని జెఫ్ బెజోస్ సందేశం ఇచ్చారు. అందులో భాగంగానే ఒకవేళ మీరు బిగ్ స్క్రీన్ టీవీలు, కార్లు, రిఫ్రిజిరేటర్లు కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటే.. కొంతకాలం పాటు ఆ పని చేయకుండా డబ్బులను ఆదా చేసుకోవడం బెటర్ అని జెఫ్ బెజోస్ స్పష్టంచేశాడు.


ఇప్పటికే ట్విటర్ కొత్త సీఈఓ ఎలన్ మస్క్ కూడా ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి స్పందిస్తూ.. మాక్రో ఎకనమిక్ ఫ్యాక్టర్స్ ఈ గ్లోబల్ రిసెషన్ కారణం అవుతున్నాయని.. రాబోయే 18 నెలల పాటు ఈ ఆర్థిక మాంధ్యం కొనసాగే అవకాశాలు ఉన్నాయని జెఫ్ బెజోస్ అభిప్రాయపడ్డాడు. ఆర్థిక మాంధ్యంను తట్టుకుని నిలబడేందుకు ఎలాన్ మస్క్ స్టార్ట్ ( Elon Musk ) చేసిన ఉద్యోగస్తుల తొలగింపు ప్రక్రియ బాటలోనే అన్ని కార్పొరేట్ సంస్థలు నడుస్తున్నాయి. అమేజాన్, ఫేస్‌బుక్ పెరెంట్ కంపెనీ మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కార్పొరేట్ సంస్థలన్నీ ఉద్యోగులను తొలగించి ఖర్చు భారాన్ని తగ్గించుకునే పనిలో పడ్డాయి.


Also Read : Flipkart Offers: వావ్.. రూ. 24 వేల Samsung Galaxy F23 5G స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 17 వేలకే.. లిమిటెడ్ అఫర్


Also Read : Amazon OnePlus TV: అమెజాన్‌లో వ‌న్‌ప్ల‌స్‌ వై సిరీస్ టీవీపై భారీ తగ్గింపు.. రూ. 15 వేలకే 32 ఇంచ్ టీవీ!


Also Read : Aadhar Sim Card Check: మీ ఆధార్‌ నంబర్‌తో ఎన్ని సిమ్‌ కార్డ్స్ ఉన్నాయి.. ? వేరేవాళ్లు ఎన్ని సిమ్‌ కార్డ్స్ తీసుకున్నారో ఇలా చెక్ చేసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook