Amazon OnePlus TV: అమెజాన్‌లో వ‌న్‌ప్ల‌స్‌ వై సిరీస్ టీవీపై భారీ తగ్గింపు.. రూ. 15 వేలకే 32 ఇంచ్ టీవీ!

Amazon Offers on OnePlus Y Series HD 32 inch TV. వ‌న్‌ప్ల‌స్‌ వై సిరీస్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ 32 ఇంచ్ టీవీ (OnePlus 32 inches Y Series HD Ready LED)పై 25 శాతం ఆఫర్ ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 17, 2022, 12:30 PM IST
  • అమెజాన్‌లో వ‌న్‌ప్ల‌స్‌ వై సిరీస్ టీవీపై భారీ తగ్గింపు
  • రూ. 14,999 వేలకే 32 ఇంచ్ టీవీ
  • వ‌న్‌ప్ల‌స్‌ వై1ఎస్ టీవీపై రూ. 5000 తగ్గింపు
Amazon OnePlus TV: అమెజాన్‌లో వ‌న్‌ప్ల‌స్‌ వై సిరీస్ టీవీపై భారీ తగ్గింపు.. రూ. 15 వేలకే 32 ఇంచ్ టీవీ!

Amazon Bumper Offer on OnePlus Y Series HD TV: ప్రముఖ మొబైల్ సంస్థ 'వ‌న్‌ప్ల‌స్' గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత దేశంలో వ‌న్‌ప్ల‌స్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ రంగంలో అద్భుతాలు సృష్టించిన వ‌న్‌ప్ల‌స్.. స్మార్ట్ టీవీలను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ మాదిరే.. స్మార్ట్ టీవీలకు కూడా భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం చాలా సిరీస్‌లు అందుబాటులో ఉన్నా.. వ‌న్‌ప్ల‌స్‌ వై సిరీస్ టీవీ చాలా ఫేమస్ అయింది. ఈ సిరీస్ కొనాలనుకునే వారికి ప్రస్తుతం మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. 

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వ‌న్‌ప్ల‌స్‌ వై సిరీస్ 32 ఇంచ్ టీవీపై (OnePlus 32 inches Y Series HD Ready LED) బంపర్ ఆఫర్ ఉంది. వై సిరీస్ 32 ఇంచ్ టీవీపై 25 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. వ‌న్‌ప్ల‌స్‌ వై టీవీ 32 ఇంచ్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 19,999గా ఉంది. 25 శాతం తగ్గింపుతో (రూ. 5000) ఈ టీవీ రూ. 14,999లకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్.

వ‌న్‌ప్ల‌స్‌ వై సిరీస్ 32 ఇంచ్ టీవీపై బ్యాంక్ ఆఫర్‌ కూడా ఉంది. కొటాక్, ఇండస్ ఇండ్, యస్ బ్యాంక్ కార్డు ద్వారా 7.5 శాతం తగ్గింపు ఉంది. నో కాస్ట్ ఈఎంఐ (₹717/month) ఆఫర్ కూడా ఉంది. కంబైన్డ్ డెలివరీ అండ్ ఇన్‌స్టాలేషన్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. డెలివరీ సమయంలోనే ఇన్‌స్టాలేషన్‌ను పొందవచ్చు. అయితే వాల్ మౌంట్ కావాలనుకుంటే మాత్రం సపరేట్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 

వ‌న్‌ప్ల‌స్‌ వై సిరీస్ టీవీ 32 ఇంచ్ స్పెసిఫికేషన్లు:
# 32 ఇంచ్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ
# 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమోరీ
# ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
# హెచ్‌డీ రెడీ 1366 x 768 పిక్సల్స్ 
# 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్
# రిఫ్రెష్ రేట్ 60 Hz

Also Read: Ariyana Glory Suffers From fatigue : అరియానాకు వచ్చిన రోగం ఇదే.. ఇప్పుడు ఎలా ఉందంటే?.. బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్ వైరల్

Also Read: Chandrababu Naidu: ఇవే నాకు చివరి ఎన్నికలు.. చంద్రబాబు సంచలన ప్రకటన  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News