Jio AirFiber Plans: జియో ఎయిర్ ఫైబర్‌లో మూడు రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్స్‌తో పాటు ఉచితంగా టీవీ ఛానెళ్లు, అపరిమితమైన 5జి ఇంటర్నెట్, ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. జియో ఎయిర్ ఫైబర్‌లో 599, 899, 1199 రూపాయల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జియో ఎయిర్ ఫైబర్ 599 ప్లాన్ 18 శాతం జీఎస్టీతో కలుపుకుని నెలకు 701 రూపాయలవుతుంది. ఈ ప్లాన్‌లో 1000 జీబీ డేటా అందుతుంది. ఈ ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది. అప్‌లోడ్ స్పీడ్ 30-40 ఎంబీపీఎస్ ఉంటుంది. అంతేకాకుండా 15 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందుతాయి. జియో ఎయిర్ ఫైబర్‌తో ఒకేసారి 10 డివైస్‌లు కనెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్స్, కంప్యూటర్లు, మొబైల్స్, సీసీటీవీ కెమేరా ఇలా అన్నింటినీ కనెక్ట్ చేయవచ్చు. దాదాపు 550 టీవీ ఛానెళ్లు ఉచితంగా చూడవచ్చు. దీంతోపాటు నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ సేవలు పొందవచ్చు.


జియో ఎయిర్ ఫైబర్ అనేది వైర్‌లెస్ వైఫై సర్వీసు. బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మై జియో యాప్ ద్వారా ఇన్‌స్టాల్లేషన్ రిక్వెస్ట్ రిజిస్టర్ చేయవచ్చు. 1000 రూపాయలు ఇన్‌స్టాల్లేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదే 1 ఏడాది ప్లాన్ తీసుకుంటే ఇన్‌స్టాల్లేషన్ ఛార్జీలు ఉచితం.100 ఎంబీపీఎస్ హై స్పీడ్ డేటా అందుతుంది. 


గత ఏడాది ఇండియాలో లాంచ్ అయిన జియో ఎయిర్ పైబర్ క్రమంగా దేశమంతటా విస్తరిస్తోంది. 2 టైర్ నగరాల నుంచి జియో ఎయిర్ ఫైబర్ కోసం డిమాండ్ అధికమౌతోంది. 


Also read: Smartphone Usage Tips: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే వారానికోసారి ఇలా చేయండి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook