Jio Phone next: జియోఫోన్ నెక్ట్స్ విక్రయాలు షురూ- కొనుగోలు ప్రక్రియ ఇదే..
How to Buy JioPhone Next: జియో నుంచి వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ జియోనెక్ట్స్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ కొనేందుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరని తెలిపింది కంపెనీ.
JioPhone Next sale starts: గూగుల్, రిలయన్స్ జియో సంయుక్తంగా అభివృద్ధి చేసిన.. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 'జియోఫోన్ నెక్ట్స్' (JioPhone next lauched in Market) దీపావళి సందర్భంగా మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది.
ఈ ఫోన్ గురించి ప్రకటన చేసినప్పటి నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ ఫోన్ విక్రయాలను ప్రారంభించినట్లు (JioPhone Next sale) కంపెనీ ప్రకటించింది.
విక్రయాలు పూర్తిగా ఆఫ్‌లైన్ ద్వారా జరుగుతున్న.. ఫోన్ కావాలనుకున్న వినియోగదారులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుందని జియో వెల్లడించింది. జియోఫోన్ నెక్ట్స్ వెబ్సైట్ ద్వారా గానీ.. 7018270182 నంబర్‌కు హాయ్ అని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయడం ద్వారా గానీ ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఈ ఫోన్ కొనాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి (How to Buy JioPhone Next) అని కంపెనీ స్పష్టం చేసింది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వినియోగదారుని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనితోపాటు లోకేషన్ కూడా పంపాల్సి ఉంటుంది. దీని ద్వారా సమీప స్టోర్ నుంచి ఫోన్‌ను ఎప్పుడపు కలెక్ట్ చేసుకోవాలనే విషయాలు ఎస్ఎంఎస్ రూపంలో పొందగలుగుతారని కంపెనీ వివరించింది.
Also read: 5G Network: ఇండియాలో 5జీ నెట్‌వర్క్ మరింత ఆలస్యం కానుందా, కారణమేంటి
Also read: Rarest of Rare: తోకతో జన్మించిన శిశువు, బ్రెజిల్ లో ఘటన
ఫోన్ ధర ఎంతంటే?
జియోఫోన్ నెక్ట్స్ ధరను (JioPhone Next price) రూ.6,499గా నిర్ణయించింది కంపెనీ. అయితే అందరికీ స్మార్ట్‌ఫోన్, 4జీ సేవలు అందించే ఉద్దేశంతో దీనిని తీసుకువచ్చిన కారణంగా.. (JioPhone next EMI) రూ.1,999 చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. మిగతా మొత్తాన్ని సులభతర ఈఎంఐలలో చెల్లించొచ్చని వెల్లడించింది. 18/24 నెలల ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంటుందని వివరించింది.
Also read: Edible Oil Price Reduced: దేశంలో భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. లీటరుకు రూ.5 నుంచి రూ.20 తగ్గింపు
ఈఎంఐ ప్లాన్లు ఇలా(JioPhone Next EMI plans)..
ఆల్వేస్ ఆన్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 24 నెలల వరకు ప్రతి నెల రూ.300 చెల్లించే వీలుంది. 18 నెలల చెల్లించాలనుకుంటే.. రూ.350 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా ప్రతి నెల 5జీబీ డేటా, 100 నిమిషాల కాలింగ్ ప్రయోజనాలు అందుతాయి.
లార్జ్ ప్లాన్‌లో: ఇందులో నెలకు రూ.450 (24 నెలల వరకు), రూ.500 (18 నెలల వరకు) ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. దీనితో పాటు రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ ఆఫర్ వినియోగించుకోవచ్చు.
ఎక్స్ఎల్ ప్లాన్: ఇందులో కూడా నెల నెల రూ.500 (24 నెలల వరకు), 18 నెలలకైతే రూ.550 చెల్లించే సదుపాయం అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు అందుతాయి.
డబుల్ఎక్సెల్: ఇదే అన్నింటికన్నా గరిష్ఠ ప్లాన్. ఇందులో 24 నెలలకైతే ప్రరతి నెల రూ.550, 18 నెలలకైతే ప్రతి నెలా రూ.600 చెల్లించాల్సి ఉఁటుంది. ఈ ప్లాన్ ఎంచుకుంటే రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంటుంది.
ఫీచర్లు..
5.45 అంగుళాల హెచ్డీ డిస్ప్లే (గొరిళ్లా గ్లాస్ ప్రొటెక్షన్)
2 జీబీ ర్యామ్/ 32 జీబీ స్టోరేజ్
క్వాల్కమ్ శ్నాప్డ్రాగన్ 215, క్వాడ్‌కోర్ ప్రాసెసర్
13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3,500 ఎంఏహెచ్ బ్యాటరీ
డ్యుయల్ నానో సిమ్
Also read: Evergreening: కస్టమర్ల సమ్మతి లేకుండానే రుణాలిచ్చేసిన బ్యాంకు
Also read: Gold Price today: దేశీయంగా బంగారం ధరల్లో మరోసారి పెరుగుదల, ఏ నగరంలో ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి