క్రిప్టో దెబ్బకు ఖాళీ అవుతున్న అమెజాన్, గూగుల్, ఫేస్బుక్
JOBS IN CRYPTO కాలం మారిపోయింది. కరెన్సీ కాని కరెన్సీ క్రిప్టో కరెన్సీ వచ్చేసింది. ఇక్కడ అంతా ఆన్‌లైనే ... లావాదేవీలు అన్నీ ఆన్‌లైన్‌లో జరిగిపోతాయి. దీంతో క్రిప్టో కరెన్సీలపై ఈ మధ్య చాలా మందికి ఆసక్తి కలుగుతోంది. డబ్బులు ఉన్న వాళ్లు క్రిప్టో కరెన్సీపై పెట్టుబడి పెడితే... డబ్బులు లేని వాళ్లు క్రిప్టోలో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరో వైపు చాలా వేగంగా విస్తరిస్తున్న క్రిప్టో ఇండస్ట్రీకి కూడా పలు ప్లాట్‌ఫామ్స్‌పై పని చేసేందుకు అనుభవజ్ఞులైన ఉద్యోగుల అవసరం ఏర్పడింది. అర్జెంట్ నీడ్ ఉండడంతో నైపుణ్యం ఉన్న నిష్ణాతులకు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధం పడుతోంది.
క్రిప్టో కరెన్సీల కంపెనీలు పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వడంతో పాటు ..... ఆకర్షణీయమైన అవకాశాలను కూడా కల్పిస్తోంది. దీంతో భారీ ప్యాకేజీలపై ఆశ పెట్టుకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా ఈ సంస్థల్లో చేరిపోతున్నారు. సిలికాన్ వ్యాలీలోని పెద్ద పెద్ద కంపెనీలు అయిన అమెజాన్, గూగుల్,ఫేస్‌బుక్‌కు లాంటి పెద్ద పెద్ సంస్థల్లో మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్లు కూడా క్రిప్టో సంస్థల్లో చేరిపోతున్నారు. టాప్ టాలెంట్ ఉన్న వాళ్లందర్ని క్రిప్టో వదులుకోవడం లేదని సాహికాయిన్ కో ఫౌండర్ మెల్బిన్ థామస్ అన్నారు. క్రిప్టోలో కేవలం టెక్ ఉద్యోగాలే కాకుండా నాన్ టెక్ ఉద్యోగాలు అయిన ... బిజినెస్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, డేటా అనాలసిస్, ఫైనాన్సియల్ అసెట్ మేనేజ్‌మెంట్, ఫైనాన్సియల్ మోడలింగ్ లో కూడా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. క్రిప్టో వ్యాపారం చాలా వేగంగా విస్తరిస్తుండండతో ఉద్యోగాలు కూడా అంతే ఎక్కువ సంఖ్యలో ఏర్పుడుతున్నాయని చెప్పారు. ఇక టెక్ ఉద్యోగాలైన కమ్యూనికేషన్, రెగ్యులర్ కోడింగ్ వంటి రంగాలతో పాటు పలు టెక్కీ ఉద్యోగాలు భారీగా ఖాళీలు ఏర్పాడయని చెప్పారు. క్రిప్టో జాబ్ పోస్టింగ్స్ 400 శాతం ప్రపంచవ్యాప్తంగా పెరిగినట్టు చెప్పారు. ఇక రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
వెబ్3, క్రిప్టో,బ్లాక్ చెయిన్ ల సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయని సమాచారం. రెగ్యులర్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తే వచ్చే జీతానికి , పదోన్నతలతో పోల్చితే క్రిప్టోలో పనిచే వారికి ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి. దీంతో చాలా కాలంగా పలు టెక్నిల్ సంస్థల్లో పనిచేసిన వాళ్లు అంతా ఇప్పుడు ఒక్కరొక్కరుగా క్రిప్టోలోకి షిఫ్ట్ అవుతున్నారు.
రానున్న రోజుల్లో అన్నీ మల్టీనేషనల్ కంపెనీలతో పోల్చితే క్రిప్టోనే ఎక్కువ జీతాలు వచ్చే ఆవకాశం ఉంది.
also read ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ త్వరలో 80 వేల మందికి ఉద్యోగాలు
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe