Startup Policies: మధ్యాహ్నం కునుకు తీయొచ్చు.. అన్‌లిమిటెడ్ లీవ్స్ తీసుకోవచ్చు.. ఈ స్టార్టప్స్‌ ఉద్యోగులకు స్వర్గధామమే..

Startup's Employee Centric Policies: ప్రపంచవ్యాప్తంగా పలు స్టార్టప్స్ ఉద్యోగులకు మరిన్ని బెనిఫిట్స్ కలిగించే కొత్త పాలసీలను తీసుకొస్తున్నాయి. ఉద్యోగులు కునుకు తీసేందుకు మధ్యాహ్నం పూట కాస్త సమయం ఇస్తున్నాయి. అంతేనా.. వెకేషన్‌కి వెళ్తే ఆ ఖర్చు తామే భరిస్తామంటున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2022, 03:05 PM IST
  • ఉద్యోగులకు స్వర్గధామం లాంటి స్టార్టప్స్
  • మధ్యాహ్నం కునుకు తీసేందుకు ప్రత్యేక టైమ్
  • అన్‌లిమిటెడ్ లీవ్స్.. నో అటెండెన్స్.. ఇంకా ఎన్నెన్నో...
Startup Policies: మధ్యాహ్నం కునుకు తీయొచ్చు.. అన్‌లిమిటెడ్ లీవ్స్ తీసుకోవచ్చు.. ఈ స్టార్టప్స్‌ ఉద్యోగులకు స్వర్గధామమే..

Startup's Employee Centric Policies: ఆఫీస్ టైమ్‌లో కునికిపాట్లు పడుతున్నారా... మధ్యాహ్నం వేళ కాసేపు కునుకు తీస్తే బాగుండనుకుంటున్నారా... ఓ రెండు వారాలు ఆఫీస్ వర్క్ నుంచి బ్రేక్ తీసుకుని ఎక్కడికైనా వెళ్తే బాగుండనుకుంటున్నారా... ఉద్యోగుల ఈ ఆలోచనా ధోరణిని ఇప్పుడిప్పుడే కొన్ని సార్టప్స్ గుర్తిస్తున్నాయి. పని విధానాలకు సంబంధించి సాంప్రదాయ పద్దతులకు భిన్నంగా కొన్ని స్టార్టప్స్ కొత్త రూల్స్‌ను తీసుకొస్తున్నాయి. ఎంప్లాయి ఫ్రెండ్లీగా ఉండే ఈ రూల్స్‌తో ఉద్యోగులకు, కంపెనీకి మధ్య అనుబంధం మరింత పటిష్టమవుతుందని భావిస్తున్నాయి. 'ఉద్యోగి' కేంద్రంగా స్టార్టప్ సంస్థల నయా పాలసీలపై ఇప్పుడో లుక్ వేద్దాం... 

వేక్‌ఫిట్ (Wakefit)

వేక్‌ఫిట్ అనే ఇండియన్ స్టార్టప్ సంస్థ ఇటీవల తమ ఉద్యోగులకు 'న్యాప్ టైమ్'ను కేటాయిస్తూ ప్రకటన చేసింది. ఉద్యోగులు ప్రతీరోజూ మధ్యాహ్నం 2గం.-2.30గం. వరకు కునుకు తీసే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇది ఉద్యోగుల హక్కు అని తెలిపింది. ఆరేళ్లుగా వ్యాపార రంగంలో ఉన్న తమ సంస్థ ఉద్యోగుల విశ్రాంతి (మధ్యాహ్నం కునుకు) విషయంలో సరైన న్యాయం చేయలేకపోయిందని... అందుకే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

డ్రీమ్ 11 (Dream11)

డ్రీమ్ 11 కంపెనీ తమ ఉద్యోగుల కోసం 'ప్రాక్సిమిటీ టు స్టేడియం' అనే ప్రోగ్రామ్‌ను లాంచ్ చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఉద్యోగులకు హెచ్ఆర్ఏ రూపంలో ప్రతీ నెలా రూ.1 లక్ష కంపెనీ అందజేస్తుంది.  ఇన్‌స్టంట్ రీలొకేషన్ పాలసీ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ముంబై ఆఫీస్‌కి వచ్చేవారికి రిలొకేషన్ ఖర్చులు మొత్తం కంపెనీ భరిస్తుంది. ఫైవ్ స్టార్ హోటల్లో మూడు వారాల పాటు ఫ్యామిలీతో ఉండేలా ఏర్పాట్లు చేస్తుంది. 

ది గుడ్ గ్లామ్ గ్రూప్ (The Good Glamm Group)

ఈ సంస్థ మరో అడుగు ముందుకేసి ఉద్యోగుల అటెండెన్స్ సిస్టమ్‌నే తొలగించింది. దానికి బదులు 'అంబర్' పేరిట చాట్‌బోట్‌ను తీసుకొచ్చింది. ఈ చాట్‌బోట్ ఉద్యోగులతో కనెక్ట్ అయి వారి నుంచి వివరాలు తెలుసుకుంటుంది. పనికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా ఇది ఆరా తీస్తుంది.

జెప్టో (Zepto)

జెప్టో అనే ఈ ఇన్‌స్టంట్ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ ఉద్యోగులకు వెకేషన్ రీయింబర్స్‌మెంట్ అందిస్తోంది. ఈ పాలసీ ప్రకారం ఉద్యోగులు ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్తే... ఆ ఖర్చు మొత్తం కంపెనీయే భరిస్తుంది. 

బీటో (BeatO)

ఈ స్టార్టప్ సంస్థ తమ ఉద్యోగులు నేరుగా ఫౌండర్స్‌తో మాట్లాడేందుకు వన్ ఆన్ వన్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తోంది. తద్వారా ఉద్యోగుల సాధక బాధకాలు నేరుగా వ్యవస్థాపకులతోనే చెప్పవచ్చు.

శ్రీ మూకాంబిక ఇన్ఫోసొల్యూషన్స్ (SMI)

మధురైకి చెందిన ఈ స్టార్టప్ సంస్థ తమ కంపెనీ ఉద్యోగులకు ఫ్రీగా పెళ్లి సంబంధాలు చూస్తామని ప్రకటించింది. అంతేకాదు, ప్రతీ ఆర్నెళ్లకు ఒకసారి ఇంక్రిమెంట్ ఉంటుందని తెలిపింది. 

సెవెన్ రూమ్స్ (SevenRooms)

కొత్త ఉద్యోగులకు ఈ కంపెనీ బంపరాఫర్ ఇస్తోంది. ఉద్యోగంలో చేరిన వెంటనే పనిలోకి కాకుండా 14 రోజుల పాటు వెకేషన్‌కు వెళ్లేందుకు అనుమతిస్తోంది. అంతేకాదు, ఆ ఖర్చు మొత్తం కంపెనీయే రీయింబర్స్‌మెంట్ కింద చెల్లిస్తుంది. 

రాకెట్‌వెర్క్జ్ (Rocketwerkz)

ఆక్లాండ్‌కి చెందిన ఈ కంపెనీ ఉద్యోగులకు అన్‌లిమిటెడ్ సిక్ లీవ్స్, యాన్వల్ లీవ్స్ ప్రకటించింది. '20 మంది టీమ్ లేదా 30 మంది టీమ్ కలిసి కంపెనీలో మిలియన్ డాలర్ల ప్రాజెక్టును డీల్ చేస్తుంటారు. వాళ్లపై నమ్మకంతోనే ఆ ప్రాజెక్టును అప్పగిస్తాం. అలాంటప్పుడు టైమ్ మేనేజ్‌మెంట్ విషయంలో వారిపై నమ్మకం ఉంచకోతే ఎలా. అందుకే అన్‌లిమిటెడ్ లీవ్స్ ఇస్తున్నాం.' అని కంపెనీ సీఈవో డీన్ హాల్ తెలిపారు.

Also Read: Hyd Drugs Rocket: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ దందా బట్టబయలు... కింగ్‌పిన్‌ని అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ...

Also Read: Yuvraj Singh Captaincy: అందుకే నేను టీమిండియా కెప్టెన్‌ కాలేకపోయా.. అసలు విషయం చెప్పిన యువరాజ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News