House Of Khaddar: కమల్ హాసన్ నిజంగానే విలక్షణుడే. సినీ ప్రపంచం నుంచి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి..ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం వైపు అడుగులేస్తున్నాడు. సరికొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించబోతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కమల్ హాసన్(Kamal Haasan). జాతీయంగా విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. సినిమాలతో పాటు పలు వ్యాపారాల్లో ఇప్పటికే అడుగుపెట్టిన కమల్ హాసన్..కొద్దికాలంగా రాజకీయాల్లో బిజిగా గడిపాడు. సొంతంగా పార్టీ పెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యాడు. ఇప్పుడు తిరిగి మరో బిజినెస్ ప్రారంభించబోతున్నాడు. ఈసారి ఫ్యాషన్ ప్రపంచంలో అడుగెడుతున్నాడు. సరికొత్త బ్రాండ్‌ ను ఆవిష్కరించబోతున్నాడు.


హౌస్ ఆఫ్ ఖద్దర్(House of Khaddar)పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను కమల్ హాసన్ లాంచ్ చేయనున్నాడు. ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించడమే కాకుండా యువతను ఖాదీకు చేరువ చేసేందుకు , నేత కార్మికులకు చేయూత అందించేందుకు హౌస్ ఆఫ్ ఖద్దర్ బ్రాండ్ లాంచ్ చేయనున్నాడు. దేశానికి ఖాదీ ఓ గర్వ కారణమని..వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. చలికాలంలో ఉండే అసౌకర్యాన్ని, వేసవి కాలంలో ఉండే వేడి నుంచి మనకు ఉపశమనం ఇస్తుంది. యువతకు ఖాదీని మరింత చేరువ చేయాలని, చేనేత కళాకారుల స్థితిగతులను మెరుగుపరచాలన్నది తన ఆలోచన అని కమల్ హాసన్ చెప్పారు. నవంబర్ నెలలో అమెరికా వెళ్లి..చికాగో నగరంలో హౌస్ ఆఫ్ ఖద్దర్ బ్రాండ్‌ను లాంచ్ చేయాలనేది కమల్ హాసన్ ఆలోచనగా ఉంది. నవంబరం 7న కమల్ హాసన్ పుట్టినరోజు. అదే రోజు హౌస్ ఆఫ్ ఖద్దర్ ఆవిష్కరణ ఉండనుంది. కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్‌కు(Shruthi Haasan)కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అమృతా రామ్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ బ్రాండ్ దుస్తుల డిజైనింగ్ జరుగుతోంది. 


Also read: Bathukamma: బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వైభవం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook