Kangana Ranaut New Car: వెండితెరపై అభిమానులను అలరించిన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగానే.. భారీ ధరను వెచ్చించి కొత్త కారును కొనుగోలు చేశారు. తన కార్ కలెక్షన్‌లో మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 4మ్యాటిక్‌ను చేర్చుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రీసెంట్‌ ముంబైలో కంగనా రనౌత్ కొత్త లగ్జరీ SUVలో వెళ్లడంపై ఫొటో గ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. కంగనా నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ ప్రొడక్షన్స్‌ పేరు మీద ఈ కారు బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇలాంటి కారు సినీ తారలు రణ్‌వీర్ సింగ్, కృతి సనన్, అజయ్ దేవగన్, దీపికా పదుకొనే, రామ్ చరణ్, నయనతార వంటి ప్రముఖులు కూడా ఉంది.


మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 4Matic కారు ప్రారంభ ధర రూ.2.96 కోట్లుగా ఉంది. ఇది 4 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. దీంతో పాటు 48V స్టార్టర్-జనరేటర్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ ఇంజన్ 550 BHP Power, 730 MN టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా 48V స్టార్టర్-జనరేటర్ సిస్టమ్ అదనపు 22bhp పవర్‌ను, 250 NM టార్క్‌ను అందిస్తుంది. GLS 600 కేవలం 4.9 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు. ఈ కారు గంటకు 250 km స్పీడ్ కెపాసిటీతో రన్ అవుతుంది. 


కంగనా రనౌత్‌కు మెర్సిడెస్-మేబ్యాక్ S680, BMW 7-సిరీస్ 730LD సహా ఇంకా చాలా కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. మెర్సిడెస్ మేబ్యాక్ S680 ధర రూ.3.43 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు 5980cc ఇంజన్‌తో వస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 603.46 BHP పవర్, 900 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంగనా వద్ద ఉన్న BMW ఫ్లాగ్‌షిప్ సెడాన్ కారు ధర రూ.1.45 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 3.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 262 bhp, 620Nm ఉత్పత్తి చేస్తుంది. 


Also Read: RCB vs SRH Dream11 Prediction: ఆర్‌సీబీతో హైదరాబాద్ ఫైట్.. బలాబలాలు, తుది జట్లు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!  


Also Read:  Actress Sri Reddy: రాత్రంతా నిద్రలేదు.. సీఎం జగన్ దాడిపై గుక్కపెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook