Actress Sri Reddy Emotional on Stone Attack On Apcm YS Jagan: ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ పై విజయవాడలో రాళ్లతో దాడి ఘటన ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారంగా మారింది. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక,టీడీపీ నేతలు దాడులు చేయించారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా.. ఈ ఘటనపై నటి, యూట్యూబర్ శ్రీరెడ్డి ఇన్ స్టా వేదికగా స్పందించారు. సీఎం జగన్ పై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఒక మంచి మనిషిపై దాడులు చేయడానికి మీకు మనస్సేలా వచ్చిందంటూ మండిపడ్డారు. సీఎం జగన్ కు రాయి ఎడమకన్ను పైభాగంలో తగిలిందని, అదే కన్నుకు తాకుంటే పరిస్థితి ఏంటని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ, జనసేన వాళ్లు అస్సలు మనుషులేనా.. ఎవరైన ఇలాంటి పనులు చేస్తారా.. అంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఆ రాయి పొరపాటున, కళ్లకు తాకుంటే, ఎంతటి ప్రమాదం జరిగి ఉండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై కొందరు దీన్ని డ్రామా అంటున్నారు.. ఆ మాటలు అనడానికి మీకు నోరెల వచ్చిందంటూ శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొందరు తన ఏడుపును కూడా డ్రామా అంటారు..మీరు మనుషులేనా అంటూ ఆమె మండిపడ్డారు. జగన్ పై దాడి వెనుక.. టీడీపీ నేత బోండా ఉమ ఉన్నాడని శ్రీరెడ్డి ఆరోపించారు. కోట్లాది మంది మనస్సులు గెల్చుకున్న వ్యక్తిని హత్యచేయాలని చూస్తారా..?.. ఒక మనిషిని హనీ తలపెట్టెంత కోపమా..?.. అంటూ శ్రీరెడ్డి మండిపడ్డారు.
మీ పదవుల కోసం.. జనమంతా ప్రేమతో ఇష్టపడే నాయకుడిని చంపడానికి ప్లాన్ లు చేస్తారా.. మీకు మనస్సు ఎలా వచ్చిందంటూ కూడా శ్రీరెడ్డి ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా.. జగన్ పై దాడి జరిగిన రోజు రాత్రి తనకు నిద్రపట్టలేదని, చచ్చిపోవాలనిపించిందన్నారు. జగనన్న.. అంటే తనకు చెప్పలేని పిచ్చి అని.. ఆయన కోసం ప్రాణాలనైన ఇస్తానంటూ శ్రీరెడ్డి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదేవిధంగా టీడీపీ నేత చంద్రబాబు, లోకేష్ పై కూడా శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు.
Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..
మీరు మనుషులేనా అస్సలు అంటూ ఆమె మండిపడ్డారు. ఇక సీఎం జగన్ దాడి ఘటనపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఇదిలా ఉండగా.. జనసేన పవన్ కళ్యాణ్, టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా రాళ్లదాడి జరిగింది. దీంతో ప్రస్తుతం ఏపీలో ఎన్నికలపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter