Kisan Credit Card Scheme: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులకు రుణం అనేది అత్యవసరమైనది గా మారింది. పంట పెట్టుబడికి, వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు, అలాగే ఎరువుల కొనుగోలుకు ఇలా ప్రతి చిన్న అవసరానికి కూడా రుణం అనేది తప్పనిసరిగా మారింది. చిన్న సన్నకారు రైతులకు బ్యాంకులు రుణాలు అందిస్తుంటాయి. అయితే వీటికి సవాలక్ష నిబంధనలు ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకొని వ్యవసాయం చేస్తే, పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడం ద్వారా మీరు అతి తక్కువ వడ్డీకే బ్యాంకు నుంచి ఏకంగా మూడు లక్షల రూపాయల రుణం పొందే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు క్రెడిట్ కార్డు రూపంలో పొందుతారు. మీరు ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత మొత్తానికి మాత్రమే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 


రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలు అమలు చేస్తోంది. దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 'కిసాన్‌ క్రెడిట్‌ కార్డు' అందజేస్తోంది. ఈ కార్డు ద్వారా రైతులకు తక్కువ వడ్డీరేటుకే రుణాలు అందజేస్తారు. పశుపోషణ  మత్స్యకారులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కార్డ్‌కు ఏ పత్రాలు అవసరం ఎలా దరఖాస్తు చేయవచ్చో తెలుసుకుందాం. 


రైతులకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ క్రెడిట్‌ కార్డును ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తారు. ఈ పథకాన్ని 1998లో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  నాబార్డ్ ప్రారంభించాయి. దీనికి కిసాన్ క్రెడిట్ కార్డ్ అని పేరు పెట్టారు. 


కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) కోసం కావాల్సిన పత్రాలు:


-పాస్‌పోర్ట్ సైజు ఫోటో


- ఆధార్ కార్డ్


-ఓటరు గుర్తింపు కార్డు


-డ్రైవింగ్ లైసెన్స్


-రైతు భూమి పత్రాలు


ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి:


-మీకు నచ్చిన ప్రభుత్వ బ్యాంకు వెబ్‌సైట్‌కి వెళ్లండి.


-మీకు హోమ్ పేజీలో కిసాన్ క్రెడిట్ కార్డ్ కనిపిస్తుంది.


- మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై క్లిక్ చేసిన వెంటనే, దరఖాస్తు చేసుకునే ఎంపిక కనిపిస్తుంది.


- మీరు సబ్ మిట్ పై క్లిక్ చేసిన వెంటనే, మీకు కొత్త పేజీ కనిపిస్తుంది. 


- మీ అన్ని వివరాలను నింపండి.  SUBMITపై క్లిక్ చేయండి.


-దీని తర్వాత మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ కనిపిస్తుంది.


-మీకు అర్హత ఉంటే, 5 రోజుల్లోగా బ్యాంక్ మిమ్మల్ని సంప్రదిస్తుంది. 


బ్యాంకులో ఇలా దరఖాస్తు చేసుకోండి:


- ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, మీరు ఎంచుకున్న బ్యాంకుకు వెళ్లాలి.


- మీరు అక్కడికి వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఫారమ్‌ను ఏదైనా బ్యాంకు ఉద్యోగి నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


- ఈ ఫారమ్‌లో మీరు మీ వివరాలన్నింటినీ పూరించి సమర్పించాలి.


ఇక్కడ ఫిర్యాదు చేయండి:


కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసిన 15 రోజులలోపు బ్యాంకు ఈ కార్డును జారీ చేస్తుంది. ఈ కార్డ్ 15 రోజులలోపు జారీ చేయబడకపోతే, మీరు బ్యాంకు అధికారులను సంప్రదించవలసి ఉంటుంది.


Also Read: Pension:ఈ స్కీములో చేరినట్లయితే..మీకు రిటైర్మెంట్ తర్వాత రెండు లక్షల పెన్షన్ లభించడం పక్కా  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.