Power Grid Corporation:  మీరు స్టాక్ మార్కెట్లో మీ పెట్టిన పెట్టుబడికి చక్కటి రాబడి పొందాలని ఆశిస్తున్నారా అయితే ప్రభుత్వ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే, మంచి రాబడి అందించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ మధ్యకాలంలో గడచిన ఐదు సంవత్సరాలుగా చక్కటి రాబడిని అందించాయి. కొన్ని స్టాక్స్ దాదాపు 15వేల శాతం వరకు లాభాన్ని అందించాయి అంటే ఆశ్చర్యం కలగక మానదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మరో ప్రభుత్వ రంగ స్టాక్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్ గడచిన ఐదు సంవత్సరాలలో దాదాపు 108 శాతం వరకు రాబడిని అందించింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రభుత్వ రంగ స్టొక్ గడచిన ఐదు సంవత్సరాలుగా స్థిరంగా ఆదాయాన్ని అందిస్తూ ఐదు సంవత్సరాల్లో 180% లాభాన్ని అందించింది. గత ఏడాదికాలంగా గమనించినట్లయితే ఈ స్టాక్ 79% లాభాన్ని అందించింది. గత ఏడాది ఆగస్టు 16వ తేదీన ఈ స్టాక్ ధర 186 రూపాయలు ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర 333 రూపాయల వరకు ఎదిగింది. 


 కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు చక్కటి లాభాలను అందిస్తోంది. ఇప్పుడు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ గురించి తెలుసుకుందాం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ 1983లో స్థాపించారు. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత ప్రభుత్వానికి చెందిన విద్యుత్ మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది.


Also Read : Banks: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా? అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేదా?అయితే పెనాల్టీ ఛార్జీలు ఇవే..!!   


ఈ కార్పొరేషన్ ద్వారా ప్రధానంగా బల్క్ పవర్ ట్రాన్స్మిషన్ ప్రోగ్రాం నడుస్తోంది. దీని ప్రధాన కార్యాలయం గురుగ్రామ్ లో ఉంది. ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా దేశ మొత్తంలో ఉత్పత్తి అయిన విద్యుత్తులో దాదాపు 50 శాతం పైగా ఈ కార్పొరేషన్ నిర్వహించే నెట్ వర్క్ ద్వారానే ప్రసారం అవుతుంది.


ఈ కంపెనీకి మొత్తం 2 లక్షల 50 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలాగే ఈ కంపెనీకి స్టాక్ మార్కెట్లలో 87 వేల 145 కోట్ల ఈక్విటీ కలిగి ఉంది. అలాగే ఈ సంస్థలో దాదాపు 25 వేల మంది పనిచేస్తున్నారు. ఇక ఈ సంస్థలో మీరు  సరిగ్గా ఏడాది క్రితం ఒక లక్ష రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేడు కనీసం మీకు రెండు లక్షల రూపాయలు లభించి ఉండేవి. 


అలాగే  ఈ స్టాక్ దేశవ్యాప్తంగా పలు రకాల విద్యుత్ ప్రాజెక్టులలో నిమగ్నమై ఉంది. ఈ దీంతో ఈ స్టాక్ భవిష్యత్తులో మరింత బలంగా పొంచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే దేశవ్యాప్తంగా పరిశ్రమలు పెద్ద ఎత్తున స్థాపిస్తున్నారు. వీటికి సంబంధించిన ఆర్డర్లు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు అందుతున్నాయి.


Also Read : Mutual Funds : నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు 35 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..!!


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook