Home Loan EMI Offers: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివర్స్ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో..ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు హోమ్ లోన్ రేట్లను కూడా పెంచేశాయి. మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే..ఏ బ్యాంకుల్లో తక్కువ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేటు ఉందో పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్బీఐ రివర్స్ రెపో రేటును పెంచిన తరువాత వివిధ బ్యాంకులు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు తక్కువ హోమ్ లోన్ ఇంట్రెస్ ఆఫర్ చేస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


హెచ్‌డీ‌ఎఫ్‌సి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ 7.15 నుంచి 8.95 శాతం వరకూ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది సంబంధిత వ్యక్తి క్రెడిట్ ప్రొఫైల్, ఇతర అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇక ఎస్బీఐ హోమ్ లోన్ అయితే 7 నుంచి 7.6 శాతం వరకూ ఉంది. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే..తక్కువ ఇంట్రెస్ రేట్ ఉంటుంది. ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆకర్షణీయమైన హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6.80 అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తోంది. హోమ్ లోన్‌‌తో పాటు 3 ఉచిత ఈఎంఐలు కూడా అందిస్తోంది. 


ఇక ఇటీవలే పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హోమ్ లోన్ ఇంట్రెస్ రేటు 6.90 నుంచి ప్రారంభమవుతుంది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం హోమ్ లోన్స్‌పై అత్యధికంగా 30 ఏళ్ల వ్యధి లేదా 60 ఏళ్ల వయస్సు ఏది ముందైతే అది అందిస్తుంది. మరో ముఖ్యమైన బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ ప్రైవేట్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేటు 6.55 శాతం నుంచి 7.6 శాతం వరకూ ఉంది. ఇక చివరిది యూనియన్ బ్యాంక్. ఈ బ్యాంక్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేటు 6.9 శాతం నుంచి ప్రారంభమవుతోంది. క్రెడిట్ స్కోరు బాగుంటే..అతి తక్కువ ఇంట్రెస్ట్ రేటు వర్తిస్తుంది. 


Also read: Jio Plan Hike: భారీగా పెరిగిన జియో ప్లాన్ ధర, ఎంతో తెలుసా..పెరిగిన ధరతో పాటు అదనపు ప్రయోజనాలు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook