Kotak FD rates: ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచిన కోటక్ బ్యాంక్.. కొత్త వడ్డీలు ఇవే..
Kotak FD rates: దిగ్గజ బ్యాంక్ కోటక్ మహీంద్రా.. ఎఫ్డీ రేట్లను పెంచింది. వివిధ రకాల కాల వ్యవధి ఉన్న డిపాజిట్లపై రేట్లను సవరిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 12 నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి.
Kotak FD rates: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసకుంది కోటక్ బ్యాంక్. సవరించింది ఈ వడ్డీ రేట్లు రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయని పేర్కొంది. పెరిగిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 12 నుంచే అమలులోకి వచ్చాయి.
కొత్త వడ్డీ రేట్లు ఇలా (సాధారణ ఎఫ్డీలకు)..
7 నుంచి 14 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2.50 శాతంగా ఉంచింది కోటక్ మహీంద్రా బ్యాంక్. సీనియర్ సిటిజన్లకు 3 శాతం.
15 నుంచి 30 రోజుల వ్యవది ఉన్న ఎఫ్డీలకు వడ్డీ రేటు 2.50 శాతం. సీనియర్ సిటిజన్లకు 3 శాతం.
31 రోజుల నుంచి 45 రోజుల మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.75 శాతంగా ఉంచింది బ్యాంకు. సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం.
46 నుంచి 90 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 2.75 శాతంగా నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం.
91 నుంచి 120 రోజుల కాల పరిమితి ఉన్న ఎఫ్డీలపై వడ్డీ రేటును 3 శాతంగా ఉంచింది కోటక్ బ్యాంక్. సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం.
121 నుంచి 180 రోజుల వ్యవధి ఉన్న ఎఫ్డీలపై వడ్డీ రేటును 3.50 శాతంగా నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు 4 శాతం.
181 నుంచి 270 రోజుల కాల పరిమితి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేటు.50 శాతం. సీనియర్ సిటిజన్లకు 5 శాతం.
271 నుంచి 363 రోజుల వ్యవధి ఉన్న ఎఫ్డీలపై వడ్డీ రేటు 4.50 శాతంగా నిర్ణయించింది బ్యాంక్. సీనియర్ సిటిజన్లకు 5 శాతం.
364 రోజుల ఎఫ్డీపై వడ్డీ రేటు 4.75 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం.
365 నుంచి 389 రోజుల ఎఫ్డీపై వడ్డీ రేటును 5.10 శాతంగా ఉంచింది కోటక్ బ్యాంక్. సీనియర్ సిటిజన్లకు 5.60 శాతం.
390 రోజుల ఎఫ్డీపై వడ్డీ రేటు 5.20 శాతంగా ఉండటం గమనార్హం. సీనియర్ సిటిజన్లకు 5.70 శాతం.
391 రోజుల నుంచి నుంచి 23 నెలలలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 5.25 శాతం. సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం.
23 నెలల 1 రోజు నుంచి రెండేళ్ల లోపు ఎఫ్డీకి వడ్డీ రేటు 5.25 శాతం. సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం.
రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్డీకి వడ్డీ రేటు 5.30 శాతం. సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం.
మూడు నుంచి 4 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.45 శాతం. సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం.
నాలుగేళ్లు నుంచి 5 సంవత్సరాల లోపు ఎఫ్డీలపై 5.50 శాతం వడ్డీ ఇస్తోంది కోటక్ బ్యాంక్. సీనియర్ సిటిజన్లకు 6 శాతం.
ఐదేళ్ల కన్నా ఎక్కువ.. పదేళ్ల వరకు ఎఫ్డీలు చేస్తే గరిష్ఠంగా 5.60 శాతం వడ్డీ చెల్లించనుంది కోటక్ బ్యాంక్. ఇదే కాలపరిమితితో సీనియర్ సిటిజన్లకు అయితే 6.10 శాతంగా వడ్డీ నిర్ణయించింది బ్యాంకు.
Also read: Flipkart Moto G22: ఫ్లిప్ కార్ట్ లో రూ.549 లకే Moto G22 స్మార్ట్ ఫోన్ అమ్మకం!
Also read: Train Ticket Booking: రైలు ప్రయాణంలో లోయర్ బెర్తు బుక్ చేసుకోవాలంటే ఇలా చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook