Interest Rates: దేశీయ ప్రైవేట్ బ్యాంకుల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కోటక్ మహీంద్రా బ్యాంకు గుడ్‌న్యూస్ అందిస్తోంది. వినియోగదారులకు వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పుడు మరోసారి వడ్డీరేట్లలో మార్పులు చేసింది. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీను పెంచుతూ కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. పెంచిన వడ్డీరేట్లు డొమెస్టిక్, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ వినియోగదారులకు వర్తించనుందని తెలిపింది. పెంచిన కొత్త వడ్డీరేట్లు మార్చ్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. 2 కోట్ల వరకూ బ్యాలెన్స్ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎక్కౌంట్లకు  కొత్త వడ్డీరేట్లు వర్తించనున్నాయి. ఫలితంగా 365 నుంచి 389 రోజుల మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీఐలపై వడ్డీ రేటు 5 శాతం పెరిగింది. గతంలో ఈ వడ్డీరేటు 4.9 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్ల కోసం 50 బేసిస్ పాయింట్లను అందిస్తుంది. దేశంలోని అన్ని బ్యాంకులు ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. గత నెలలో ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ , ఐడీబీఐ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి.


7 రోజుల్నించి నెలరోజుల్లోగా ఉన్న ఎఫ్‌డీలపై 2.5 శాతం కాగా, నెల నుంచి 3 నెలల వరకూ ఉంటే..2.75 శాతం ఉంది. ఇక 3 నెలల్నించి 4 నెలల్లోగా ఉంటే 3 శాతం, 7 రోజుల్నించి పదేళ్ల కాలపరిమితిలో ఉంటే..2.5 నుంచి 5.8 శాతం ఉంటుంది. ఇక 181 రోజుల్నించి 365 రోజుల వరకైతే..4.4 శాతముంటుంది. ఏడాదిలోగా ఉంటే 4.5 శాతం, 390 రోజుల్నించి 23 ఏళ్లలోపుంటే..5.1 శాతం ఉంటుంది. ఇక 3 నుంచి 5 ఏళ్లలోపుంటే..5.45 శాతం, 5 ఏళ్లు పైబడిన ఎఫ్‌డీలకు 5.5 శాతం వడ్డీరేట్లుంటాయి.


Also read: Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. దేశంలోని వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook