Gold Rate Today: బంగారం ధర మన దేశంలో రికార్డు స్థాయికి చేరింది. దేశంలోని పలు నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 54 వేల ఎగువకు చేరుకుంది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాముల బంగారాని రూ. 427 ధర పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రా. సువర్ణం ధర రూ. 54,377గా ఉంది.
మెట్రో నగరాల్లో బంగారం ధరలు
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పది గ్రాముల బంగారం ధర రూ. 54,283కు చేరుకుంది. మరోవైపు పశ్చిమ బంగాల్ రాజధాని కోల్ కతాలో రూ. 54,700 పసిడి ధర చేరింది. చెన్నైలో రూ. 54,770 గా బంగారం ధర కొనసాగుతుంది.
బంగారంతో పాటు కిలో వెండి ధర కూడా బాగా పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.710 పెరగడం వల్ల దాని ధర రూ. 71,318కి చేరుకుంది. ఇకపోతే ముంబయిలో రూ.71,878 కిలో వెండి ధర ఉండగా.. కోల్‌కతాలో రూ.71700, చెన్నైలో రూ.76,700లుగా వెండి ధర కొనసాగుతుంది.
Also Read: Flipkart Samsung TV: రూ.21 వేల విలువైన శాంసంగ్ స్మార్ట్ టీవీని రూ.6 వేలకే కొనేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook