NMMSS Online Last Date: మన దేశంలో స్కూల్ డ్రాపౌట్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్ డ్రాప్ ఔట్ సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రత్యేక స్కాలర్ షిప్ ఇస్తోంది. ఈ స్కాలర్‌షిప్ కింద విద్యార్థికి మొత్తం సంవత్సరానికి రూ. 12,000 లభిస్తాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ పథకం కింద లక్ష మందికి స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులు 2024-25 సంవత్సరానికి 'నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్' (NMMSS) కోసం అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోగలరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంవత్సరం, ఇప్పటివరకు వేలాది మంది కొత్త విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు ముందుగా NSP పోర్టల్‌లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేయాలి. ఆ తర్వాత వారు ఎంచుకున్న స్కాలర్‌షిప్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 


'నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్' ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్ ద్వారా విద్యార్థులు తమ పాఠశాల విద్యను హయ్యర్ సెకండరీ స్థాయి వరకు అంటే పన్నెండవ తరగతి వరకు పూర్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. స్కాలర్‌షిప్‌ల కోసం అర్హత పరీక్షలో అర్హత సాధించిన 9వ తరగతి విద్యార్థులకు ఈ పథకం ప్రతి సంవత్సరం లక్ష కొత్త స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. విద్యార్థి అకడమిక్ పనితీరు ఆధారంగా 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు రెన్యూవల్ మోడ్ ద్వారా స్కాలర్‌షిప్ కొనసాగుతుంది. 


Also Read: PAN Card: పాన్ కార్డు విషయంలో ఈ ఒక్క చిన్న తప్పు చేస్తే రూ. 10 వేలు ఫైన్ పడే చాన్స్ 


ఏటా 12 వేల రూపాయలు అందుతాయి:


రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం అమలులో ఉంది. ఇందులో ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.12,000 స్కాలర్‌షిప్ మొత్తం లభిస్తుంది. నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMSS) నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా అమలు చేస్తున్నారు. 


8వ పరీక్షలో 55 శాతం మార్కులు సాధించాలి:


ఈ ఏడాది అక్టోబర్ 15 వరకు కొత్తగా 84,606, రెన్యూవల్‌కు 1,58,312 దరఖాస్తులు వచ్చాయి. NMMSS స్కాలర్‌షిప్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) మోడ్‌ను అనుసరించి ఎంచుకున్న విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా పంపిణీ చేస్తుంది. స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హత ప్రమాణాలలో తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ. 3.50 లక్షలకు మించకూడదు. స్కాలర్‌షిప్ కోసం ఎంపిక పరీక్షలో హాజరు కావడానికి, 8వ తరగతి పరీక్షలో కనీసం 55 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం https://www.education.gov.in/nmms అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.


Also Read: Money: ఏటీఎం నుంచి చిరిగిన కరెన్సీ నోట్లు వస్తే ఏం చేయాలి ? RBI నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి ?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.