కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు, వాటి ఫీచర్స్, ధరలు, కెమెరా సెటప్ డీటేల్స్
మార్కెట్‌లో ఈ 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. 6GB+128GB వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర 21,999 రూపాయలు కాగా 8GB+128GB మొబైల్ ధర రూ. 23,999 గా ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇలా మూడు 50MP + 48MP + 48MP కెమెరాలతో లాంచ్ అయిన ఫోన్ ఇదొక్కటే.
శాంసంగ్ గెలాక్సీ M42 5G
క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగాన్ 750G ఆక్టాకోర్ 5G ఎస్ఓసి ప్రాసెసర్‌తో రూపొందిన ఈ శాంసంగ్ గెలాక్సీ M42 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఆపరేట్ అవుతుంది. హెచ్‌డి ప్లస్ అమోల్డ్ టెక్నాలజీతో 6.6 ఇంచుల డిస్‌ప్లేను అమర్చారు. మార్కెట్‌లో ఈ 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. 6GB+128GB వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర 21,999 రూపాయలు కాగా 8GB+128GB మొబైల్ ధర రూ. 23,999 గా ఉంది.
ఇంకొన్ని ఇతర ఫీచర్స్:
కెమెరా: 48MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP + 5MP + 5MP తో నాలుగు కెమెరాల సెటప్‌తో ఈ ఫోన్‌ని రూపొందించారు.
సెల్ఫీ కెమెరా: బ్యూటీఫుల్ సెల్ఫీల కోసం స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో 20MP కెమెరాను ఏర్పాటు చేశారు.
బ్యాటరీ కెపాసిటీ: 5000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అమర్చారు.
షావోమి ఎంఐ 11 అల్ట్రా:
క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగాన్ 888 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌తో తయారైన ఈ షావోమి ఎంఐ 11 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా నడుస్తుంది. 6.81 ఇంచుల డిస్‌ప్లేను అమర్చారు. లేటెస్ట్ టెక్నాలజీతో లాంచ్ అయిన ఈ 5G స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 69,999 రూపాయలుగా ఉంది.
ఇంకొన్ని ఇతర ఫీచర్స్:
కెమెరా: 50MP + 48MP + 48MP తో మూడు కెమెరాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో ఇలా మూడు 50MP + 48MP + 48MP కెమెరాలతో లాంచ్ అయిన ఫోన్ ఇదొక్కటే.
ఫ్రంట్ కెమెరా: అందమైన సెల్ఫీల కోసం మొబైల్ ముందు భాగంలో 20MP కెమెరాను అమర్చారు.
బ్యాటరీ కెపాసిటీ: 5000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీతో ఈ ఫోన్ తయారైంది.
షావోమి ఎంఐ 11 ఎక్స్:
క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగాన్ 870 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌తో రూపొందిన ఈ షావోమి ఎంఐ 11 ఎక్స్ 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఆపరేట్ అవుతుంది. 6.67 ఇంచుల డిస్‌ప్లేను ఈ ఫోన్ తయారైంది. ఈ 5G మొబైల్ ఫోన్ రెండు వేరియంట్స్‌లో లాంచ్ అయింది. 6GB ర్యామ్ +128GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర 29,999 రూపాయలు కాగా 8GB ర్యామ్ +128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999 గా కంపెనీ నిర్ణయించింది.
ఇంకొన్ని ఇతర ఫీచర్స్:
కెమెరా సెటప్: ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 48MP + 8MP + 5MP కెమెరాలు అమర్చారు.
ఫ్రంట్ కెమెరా: అందమైన సెల్ఫీ పిక్స్ తీసుకునేందుకు వీలుగా స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో 20MP కెమెరాను అమర్చారు.
బ్యాటరీ కెపాసిటీ: 4520mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీతో ఈ ఫోన్ తయారైంది.
33W ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కలదు.