Latest Upcoming Electric Cars in India 2023: పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతుండడంతో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతోంది. ఈవీ కొనుగోలుదారుల కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. టాటా మోటార్స్ ప్రస్తుతం 85 శాతం మార్కెట్ వాటాతో ఈవీ సెగ్మెంట్‌ను శాసిస్తోంది. అయితే టాటా మోటార్స్ హవా తగ్గనుంది. ఎందుకంటే.. రాబోయే రోజుల్లో ఇతర వాహన తయారీదారులు కూడా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయబోతున్నాయి. రాబోయే 18 నెలల్లో విడుదల చేయనున్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MG COMET EV: 
ఎంజీ మోటార్ ఇండియా కొత్త 'కామెట్ ఎలక్ట్రిక్ కార్' (MG COMET EV)ని ఏప్రిల్ 2023లో దేశంలో విడుదల చేయనుంది. ఇది 2-డోర్ల ఎలక్ట్రిక్ కారు. ఇది కేవలం 2.9 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ కారు టాటా నానో కంటే కూడా చిన్నది. దీనిని దాదాపు రూ. 10 లక్షల ధరతో విడుదల చేయవచ్చు (ఎక్స్-షోరూమ్, ఇండియా).


TATA CURVV:
టాటా మోటార్స్ వచ్చే ఏడాది Curvv SUV (ఎలక్ట్రిక్ మరియు ICE పవర్‌ట్రెయిన్) కూపేని విడుదల చేయనుంది. ఇది MG ZS EV, హ్యుందాయ్ కోనా EV మరియు మహీంద్రా XUV400 లకు పోటీగా ఉంటుంది. ఈ కారు కూడా GEN 2 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.


TATA PUNCH EV:
మీడియా నివేదికల ప్రకారం టాటా మోటార్స్ ఈ ఏడాది చివరి నాటికి పంచ్ మైక్రో ఎస్యూవీ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది Gen 2 (సిగ్మా) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రానుంది. ఇందులో 26kWh మరియు 30.2kWh రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికను ఇచ్చే అవకాశం ఉంది.


BYD SEAL:
BYD 2023 ఆటో ఎక్స్‌పోలో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను ప్రదర్శించింది. ఎలక్ట్రిక్ సెడాన్ 2023 నాలుగో త్రైమాసికంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర దాదాపు రూ.70 లక్షలు ఉంటుందని అంచనా.


MAHINDRA XUV e8:
2022లో మహీంద్రా INGLO బోర్న్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా 5 ఎలక్ట్రిక్ ఎస్యూవీలను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ SUVలు XUV మరియు BE బ్రాండ్ల క్రింద విక్రయించబడతాయి. XUV ఎలక్ట్రిక్ బ్రాండ్ క్రింద ప్రారంభించబడే మొదటి కారు XUV.e8. ఇది డిసెంబర్ 2024 నాటికి ప్రారంభించబడుతుంది.


Aslo Read: iPhone 13 Pro Max Discount: ఐఫోన్ 13 ప్రో మాక్స్‌పై భారీ తగ్గింపు.. ఈ అవకాశం కొన్ని రోజులు మాత్రమే!  


Also Read: Best Mileage Cars 2023: బెస్ట్ మైలేజ్ 7 సీటర్ కార్లు ఇవే.. లీటర్‌పై 26 కిలోమీటర్లు! ధర 6 లక్షల నుంచి స్టార్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.