2023 కొత్త ఏడాది ప్రారంభమై ఇంకా రెండవ నెలే నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక మాంద్యం కారణంగా ఉద్యోగాలు పీకే ప్రక్రియ లే ఆఫ్ నడుస్తోంది. అప్పుడే కొత్త ఏడాదిలో 1 లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడంతా లే ఆఫ్ సీజన్ నడుస్తోంది. అన్నింటికంటే అత్యధికంగా గూగుల్ కంపెనీ 6 శాతం సిబ్బందిని అంటే 12 వేలమందిని తొలగించేసింది. లే ఆఫ్ ప్రకటించిన వివిధ కంపెనీల్లో ఇదే గరిష్టం. ఆర్ధిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాస్ట్ కటింగ్ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు వేలాది ఉద్యోగుల్ని ఇటీవల లే ఆఫ్ పేరిట తొలగించేస్తున్నాయి. మొత్తం టీమ్‌తో సహా భారీగా ఉద్యోగుల్ని హఠాత్తుగా ఇంటికి పంపించేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఓ రిపోర్ట్ ప్రకారం కేవలం 2023 42 రోజుల్లోనే మొత్తం 332 టెక్ కంపెనీలు 1 లక్షా 746 మందిని తొలగించేసింది.


గూగుల్, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, అమెజాన్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు కొత్త ఏడాదిలో వేలాదిమందికి లే ఆఫ్ ఇచ్చేశాయి. అన్నింటికంటే గరిష్టంగా గూగుల్ కంపెనీ 6 శాతం సిబ్బంది అంటే 12 వేలమందిని తొలగించింది. ఇక ఆ తరువాత మైక్రోసాఫ్ట్ కంపెనీ 10 వేలమందిని, అమెజాన్ 8 వేలమందిని తొలగించింది. సేల్స్‌ఫోర్స్ వంటి ఇతర ఐటీ కంపెనీలు 8 వేలమందిని తొలగించాయి. డెల్ కంపెనీ 6,650 మందిని, ఐబీఎం 3,900 మందిని, శాప్ 3 వేలమందిని, జూమ్ 1300 మందిని , కోయిన్‌బేస్  950 మందిని తొలగించాయి.


ఇక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న లే ఆఫ్ ప్రక్రియలో కొత్తగా యాహూ చేరింది. యాహూ కంపెనీ తాజాగా 20 శాతం మందిని అంటే 1600 మందిని తొలగించింది.12 శాతం మంది అంటే 1000 మందిని తొలగించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇక రానున్న 6 నెలల్లో 8 శాతం అంటే 600 మందిని తొలగిస్తామని కంపెనీ వెల్లడించింది. ఇవి కాకుండా మైక్రోసాఫ్ట్‌కు చెందిన గిట్ హబ్ కూడా 10 శాతం అంటే 300 మందిని వచ్చే క్వార్టర్ నాటికి తొలగిస్తామని ప్రకటించింది. తమ కంపెనీ ఆఫీసుల లీజ్ పూర్తయ్యాక.వెకేట్ చేసేందుకు సిద్ధమైంది. భవిష్యత్ సరిగ్గా లేకపోవడం ఆర్ధికంగా తీవ్రమైన ఒత్తిడి లే ఆఫ్2కు కారణమని టెక్ కంపెనీలు చెబుతున్నాయి. డెల్ టెక్నాలజీస్ కంపెనీ 5 శాతం సిబ్బంది అంటే 6,640 మందిని తొలగించిది.


2023లో లే ఆఫ్ కారణంగా ఏ కంపెనీలో ఎంతమంది తొలగింపు


మైక్రోసాఫ్ట్            5 శాతం సిబ్బంది 10 వేలమంది తొలగింపు
అమెజాన్             3 శాతం సిబ్బంది  8 వేల మంది తొలగింపు
సేల్స్‌ఫోర్స్        10 శాతం సిబ్బంది 8 వేలమంది తొలగింపు
డెల్ కంపెనీ        5 శాతం సిబ్బంది అంటే 6,650 మంది తొలగింపు
ఐబీఎం                2 శాతం 3,900 మంది తొలగింపు
శాప్                      3 శాతం 3 వేలమంది తొలగింపు
జూమ్                  15 శాతం 1300 మంది తొలగింపు
కోయిన్‌బేస్        20 శాతం అంటే 950 మంది తొలగింపు
యాహూ               20 శాతం అంటే 1600 మంది తొలగింపు
గిట్ హబ్             10 శాతం 300 మంది తొలగింపు


Also read: Zomato: జొమాటో మూతపడనుందా, 225 పట్టణాల్లో వ్యాపారాన్ని ఎందుకు క్లోజ్ చేసింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook