Zomato: జొమాటో మూతపడనుందా, 225 పట్టణాల్లో వ్యాపారాన్ని ఎందుకు క్లోజ్ చేసింది

Zomato: దేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు ఏమౌతుంది. ఎందుకు తన వ్యాపారాన్ని తగ్గించుకుంటోంది. ఈ ప్రశ్నలు ఆశ్చర్యంగా అన్పిస్తున్నా నిజమే..ఏకంగా 225 చిన్న పట్టణాల్లో జొమాటో వ్యాపారాన్ని బంద్ చేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 12, 2023, 03:04 PM IST
Zomato: జొమాటో మూతపడనుందా, 225 పట్టణాల్లో వ్యాపారాన్ని ఎందుకు క్లోజ్ చేసింది

జొమాటో సంస్థ వ్యాపారం తగ్గుతోందా లేదా తగ్గిస్తోందా అనేది ఇప్పుడు సందేహాస్పదంగా మారింది. జనవరి నెలలో దాదాపు 225 పట్టణాల్లో వ్యాపారాన్ని క్లోజ్ చేసింది. డిసెంబర్ త్రైమాసిక నివేదికలో జొమాటో ఈ విషయాన్ని ధృవీకరించింది. 

జొమాటో ఛీఫ్ ఫైనాన్షియల్ అధికారి అక్షత్ గోయల్ జనవరి నెలలో కంపెనీ వ్యాపారం గురించి కీలక విషయాల ధృవీకరించారు. దాదాపు 225 చిన్న పట్టణాల్లో వ్యాపారాన్ని బంద్ చేసింది. పరిస్థితులు సవాళ్లు విసురుతున్నాయని..అయితే కొద్దిరోజుల్లోనే అంతా మెరుగుపడవచ్చని జొమాటో సీఎఫ్ఓ అక్షత్ గోయల్ తెలిపారు. గత కొద్ది నెలలుగా వ్యాపారం సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ చిన్న చిన్న పట్టణాల్లో వ్యాపారం మూసివేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఈ పట్టణాల్లో వ్యాపారం మూసివేయడం వల్ల కంపెనీ వ్యాపారంపై ప్రభావం పడదన్నారు. జొమాటో సంస్థ వార్షిక నివేదిక ప్రకారం 2021-22లో దేశంలోని 1000 కంటే ఎక్కువ పట్టణాల్లో వ్యాపారం కొనసాగుతోంది. 

5 రెట్లు పెరిగి 346 కోట్లకు చేరుకున్న జొమాటో నష్టం

జొమాటో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికపు నివేదిక జారీ చేసింది. ఇందులో సక్సెస్ ఆర్డర్ విలువ 0.3 శాతంగా ఉంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 75 శాతం పెరిగి 1948 కోట్లకు చేరుకుంది. నష్టం మాత్రం 3 రెట్లు పెరిగి 346 కోట్లు అయింది.

మరోవైపు శుక్రవారం మార్కెట్ క్లోజ్ సమయానికి జొమాటో షేర్ 2 శాతం పడిపోయింది. బీఎస్ఈలో కంపెనీ షేర్ 2.02 శాతం క్షీణించి 53.30 రూపాయల వద్ద ముగిసింది. రోజంతా ట్రేడింగ్ సమయంలో 7.4 శాతం నష్టంతో 50.35 రూపాయలకు చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో కంపెనీ షేర్ 1.65 శాతం పడిపోవడంతో 53.50 రూపాయలైంది.

Also read: IRCTC New Rules: ఐఆర్‌సీటీసీ కొత్త నియమాలు, మీ ఎక్కౌంట్ ఇలా వెరిఫై చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News