Launch Cheapest Indian Car: ఇండియన్‌ లెజండరీ బిజినెస్‌ మెన్‌ తుది శ్వాస విడిచారు. ఆయన ఎంతో మందికి సామాన్యులకు సైతం స్పూర్తిదాయకం. వయస్సురీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలతో నిన్న బుధవారం చికిత్స పొందుతూ మరణించారు. రతన్ టాటా గురించి చెప్పడానికి ఎంతో ఉంది. ముఖ్యంగా సామాన్యులకు లక్ష రూపాయల కారు ప్రతి ఇంటికి అందిస్తానని హామీ ఇచ్చారు.. అలాగే ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బైక్‌ ధరలకే కారు అందుబాటులో ఉండటం ఎంత సహసం. అదే టాటా పరిచయం చేసిన 'టాటా నానో' కారు. సామాన్యులు ప్రతి ఒక్కరి ఇంటికి కారు అందిస్తానన్న ఈ దిగ్గజ కల నెరవేరడానికి భారీగా నష్టాలను చవిచూశారు. 


అయినా కానీ, ఇచ్చిన హామీ మేరకు నానో కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. రతన్‌ టాటా 1937 డిసెంబర్‌ 28న జన్మించారు. 1990 నుంచి 2012 టాటా గ్రూప్‌ చైర్మన్‌గా కొనసాగారు. ఆ తర్వాత 2016-2017 వరకు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించారు. అతని సంపాదనలో 60 శాతం ట్రస్టులకు దానం చేసే దాతృత్వం కలవారు. ఎన్నో ఛారిటబుల్ ట్రస్టులకు అధినేతగా ఉన్నారు. దీనికి ఆయన 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌ కూడా పొందారు. ఆ తర్వాత 2008లో పద్మవిభూషణ్‌ అందుకున్నారు.


ఇదీ చదవండి: దసరా పండుగ ఆ రోజు మాత్రమే జరుపుకోవాలి? పండితుల సూచన ఇదే..!  


టూవీలర్‌కు ప్రత్యామ్నాయంగా ఆయన పరిచయం చేసిన కారు మార్కెట్‌ విపణీలోకి 2008లో చేరింది. ఈ కారు తయారు చేయడానికి ప్రధాన లక్ష్యం టూవీలర్‌ నడిపేవారికి ఆ ధరలోనే సురక్షితమైన సరసమై ధరలకే అందించడం. ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే కొత్త భావనకు దారితీసింది.


ఇదీ చదవండి: సద్దుల బతుకమ్మ విశిష్టత తెలుసా? ఈరోజు ప్రసాదం ఎంతో విశేషం..  


టాటా నానో కారు విక్రయాల్లో నష్టాలను చూశారు. అయినా కానీ, ఉత్పత్తుల విషయంలో ఏ మాత్రం తగ్గలేదు టాటా. ఆయన ప్రధాన లక్ష్యం లాభాలను ఆర్జించడం కాదు సామాన్యులకు సరమైన ధరలోనే కారు అందించడం..కానీ, మార్కెట్‌ సవాళ్లు, వినియోగదారుల అభిరుచుల్లో మార్పుల కారణంగా టాటా నానో విక్రయాలు రానురాను బాగా క్షీణించాయి.దీంతో ఆయన 2018లో నానో కారు తయారీని నిలిపివేశవారు.ఇక ఈ దిగ్గజ మరణవార్తను విని దేశంలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. పీఎం నరేంద్ర మోదీ కూడా టాటా మృతిపై దిగ్భృంతికి గురయ్యారు ఆయన ట్వీట్టర్‌ వేదికగా తన సంతాపాన్ని తెలియజేశారు. దేశాభివృద్దికి ఆయన చేసిన కృషి చేశారని మోదీ ట్వీట్‌ చేశారు. ప్రముఖ బిజినెస్‌మెన్‌ హర్ష గొయెంకా టాటా మరణవార్తను అధికారికంగ సోషల్‌ మీడియా వేదికగా ధృవీకరించారు. రతన్‌ టాటా, నాయకత్వ లక్షణాలతో ఎదిగిన వ్యక్తి ఆయన మన హృదయంలో ఎప్పటికీ ఉండిపోతారు అని హర్ష గోయెంకా ట్వీట్‌ చేశారు. ఆయన మరణవార్తను విని యావత్‌ భారత్‌ దేశం ఒక్కసారిగా దిగ్భ్రంతికి గురయింది. భారత్‌ ఓ వ్యాపార దిగ్గజాన్నే కోల్పోయింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి