LIC Policy Holders: ప్రపంచంలోనే మూడవ అతిపద్ద జీవిత భీమా సంస్థ, దేశంలోనే నెంబర్ వన్ ఆర్గనైజేషన్ ఎల్ఐసీ. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక ప్రైవేటుపరం కానుంది. త్వరలో పబ్లిక్ ఇష్యూ వెలువడనుంది. ఈ క్రమంలో పాలసీదారులకు ఎల్ఐసీ గుడ్‌న్యూస్ విన్పిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఐపీఓ త్వరలో వెలువడబోతోంది. పాలసీదారులకు గుడ్‌న్యూస్ అందిస్తూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పాలసీదారులకు ఐపీవోలో పదిశాతం డిస్కౌంట్ అందించనుంది. ఈ వారంలో దీనికి సంబంధించి రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఫైల్ సిద్ధం కానుంది. ఓపెనింగ్ ఐపీవోలో పాలసీదారులకు తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. రిటైల్ విండో కింద పాలసీదారులకు నిర్ధిష్టమైన రిజర్వేషన్ కేటాయించనున్నారు. ఎల్ఐసీ చట్టం ప్రకారం పది శాతం వరకూ ఉండవచ్చని సమాచారం. ఇందుకు కావల్సిన, అర్హత కలిగిన నిబంధనలు రూపొందించారు. పాలసీదారులతో పాటు సంస్థ ఉద్యోగులకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. రిటైల్ పెట్టుబడిదారులు, ఉద్యోగులకు రాయితీ కూడా లభించే అవకాశాలున్నాయి. అయితే ఏ మేరకు తగ్గింపు ఉంటుందో అనేది ఇంకా వెల్లడి కాలేదు. 


ఎల్ఐసీ ఓపెనింగ్ ఐపీవోలో (LIC IPO) సామాన్యుల్ని సైతం భాగస్వామ్యం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. ఐపీవోలో 5 నుంచి 10 శాతం సామాన్యులకు కేటాయింపు ఉండవచ్చు. మరోవైపు పబ్లిక్ ఇష్యూకు వెళ్లే క్రమంలో భాగంగా ఫైనాన్స్ చట్టం 2022లో కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. సెబీ నిబంధనలకు అనుగుణంగా ఆరుగురు డైరెక్టర్లను నియమించింది. 


Also read: Tata Free Offers: టాటా నుంచి అద్భుతమైన ఆఫర్, అపరిమితమైన సర్వీస్‌తో ఫ్రీ డేటా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook