LIC IPO is expected to hit the market by the fourth quarter: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం.. 'భారతీయ జీవిత బీమా కార్పొరేషన్​' (ఎల్​ఐసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు సంబంధించి మరో అప్​డేట్ (LIC IPO update) వెలువడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎల్​ఐసీ ఐపీఓ ఉంటుందని.. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్ పబ్లిక్ అసెట్​ మేనేజ్​మెంట్​ (దీపమ్​) కార్యదర్శి తుహిన్ కాంతపాండే (DIPAM on LIC IPO) తెలిపారు. పరిశ్రమల విభాగం ఐసీసీ నిర్వహించిన గ్లోబల్​ ఎకానమిక్​ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు.


ఎల్​ఐసీ ఐపీఓతో పాటు.. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న పలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణగాపై కూడా పలు కీలక విషయాలు వెల్లడించారు పాండే.


Also read: వరుసగా రెండవరోజు పెరిగిన బంగారం ధర, దేశవ్యాప్తంగా ఏ నగరంలో ఎంత ధర


భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL), ఈఈఎంఎల్​, షిప్పింగ్​ కార్పొరేషన్, పవన్ హాన్స్​, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్​, ఎన్​ఐఎన్​ఎల్​ సంస్థలను ప్రైవేటీకరించున్నట్లు తెలిపారు. ఇందు కోసం డిసెంబర్​-జనవరి మధ్య ఫినాన్షియల్ బిడ్లను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. వీటి ప్రైవేటీకరణ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోనే పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.


ఇప్పటికే ప్రభుత్వ రంగ ఎయిర్​ ఇండియాను టాటా సన్స్ (Air India to Tata sons)​ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థను వచ్చే నెలలో టాటా సన్స్​కు అప్పగించే ప్రక్రియ పూర్తవనున్నట్లు తెలిపారు పాండే. ఇందుకోసం ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. సంస్థ అప్పులపై గత నెలలోనే ప్రక్రియ మొదలైంది. దీనితో పాటు ఎంపీలకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇచ్చే ఉచిత టికెట్ సదుపాయాలు రద్దయ్యాయి.


Also read: యమహా నుంచి మార్కెట్లోకి మరో కొత్త బైక్.. ధర ఎంతో తెలుసా ?


Also read: బ్లూమ్‌బర్గ్ నివేదిక : అత్యంత ధనిక దేశం ఇప్పుడు అమెరికా కాదు..చైనానే


ప్రైవేటీకరణ ఎందుకు?


2021-22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఓ బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రైవేటీకరణకు అనుగుణంగా ఉన్న బ్యాంకుల ఎంపిక బాధ్యతను నీతి ఆయోగ్​కు అప్పగించింది కేంద్రం. ఈ ప్రైవేటీకరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం గడించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Also read: OnePlus Nord 2 Pac-Man smartphone: వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర


Also read: Special Notes: 786 నంబర్ ఉన్న నోట్లు మీ దగ్గర ఉన్నాయా..? అయితే రూ.3 లక్షలు మీవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook