OnePlus Nord 2 Pac-Man smartphone specs, price: ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్‌లోకి వన్‌ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ ఎడిషన్ పేరిట కొత్తగా లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి వన్ ప్లస్ ఎప్పటి నుంచి ఊరిస్తూ వస్తోంది. వన్ ప్లస్ గతంలో లాంచ్ చేసిన నార్డ్ 2 సిరీస్‌లో ఇది న్యూ ఎడిషన్ ఫోన్. చీకట్లో మెరిసేలా ఫ్లోరోస్కెంట్ బ్యాక్ డిజైన్‌తో తయారైన ఈ వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్‌కి 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఫ్లూయిడ్ అమోల్డ్ పంచ్ హోల్ డిస్‌ప్లేను అమర్చారు.
OnePlus Nord 2 Pac-Man edition smartphone specs: వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్
Android : ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11.3 తో ఆపరేట్ అవుతుంది.
Processor : ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 1200 ఎస్ఓసి చిప్‌ను అమర్చారు.
RAM, Internal Storage: 12GB RAM ప్లస్ 256GB ఇంటర్నల్ స్టోరేజీ
Battery, Charger: 4,500mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ చార్జర్
Audio jack : మరింత స్పష్టమైన ఆడియో కోసం 3.5mm ఆడియో జాక్
Camera : త్రిపుల్ కెమెరా సెటప్‌లో Sony IMX766 lens తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మోనో సెన్సార్ కెమెరాలు అమర్చారు.
Selfie camaera: ఇన్-బిల్ట్ బ్యూటీ ఫీచర్‌తో 32MP ఫ్రంట్ కెమెరాను ఫోన్ ముందు భాగంలో అమర్చారు.
OnePlus Nord 2 Pac-Man price: వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ. 37,999 గా నిర్ణయించారు. ఈ విషయాన్ని వన్‌ప్లస్ ముందుగానే ప్రకటించింది.
Also read : OPPO foldable smartphones: ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయ్
నవంబర్ 16 నుంచి అమేజాన్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌తో (Amazon) పాటు వన్‌ప్లస్ కంపెనీ (Oneplus Nord 2 latest mobiles) అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. యూరప్, యూకేలతో పోలిస్తే.. భారత్‌లో ఇంకొంత తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. భారతీయ కరెన్సీ ప్రకారం యూరప్‌లో వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ధర రూ. 44,900 గా ఉండగా బ్రిటన్‌లో రూ. 49,900 గా (OnePlus Nord 2 Pac-Man price) వన్ ప్లస్ కంపెనీ నిర్ణయించింది.
Also read : Electric Scooter: దేశంలో కారుచౌక ధరకే అందుబాటులో రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook